Home » NRI Latest News
సౌదీలో జరిగిన యాక్సిడెంట్‌లో గాయపడి ఒంటరిగా మారిన ఓ హైదరాబాద్ మహిళకు మరో తెలుగు మహిళ అండగా నిలిచారు. ఆమెకు వెన్నంటే ఉంటూ సపర్యలు చేసి స్వస్థలానికి చేర్చారు.
తానా మహాసభలను పురస్కరించుకుని తానా కాన్ఫరెన్స్ నిర్వాహకులు డెట్రాయిట్‌లో వివిధ ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నిర్వహించిన త్రోబాల్, వాలీబాల్ పోటీలు విజయవంతమయ్యాయి.
యూఎస్ఏలో పర్యటించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అక్కడి ఎన్నారైలు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఏపీ సీఎం నిర్ణయాలు దేశ ప్రగతికి మార్గదర్శకమని ప్రశంసించారు.
కెనడాలో ఉద్యోగాల కొరత అధికంగా ఉందంటూ ఓ యువతి పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. కెనడాకు వద్దామనుకునే వారు ఈ వీడియో చూడాలని ఆమె సూచించారు.
గల్ఫ్‌లో ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో అక్కడున్న మరో 25 మంది తెలంగాణ వాసులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. వారి ప్రయాణానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
కమ్యూనిటీకి సేవలందించడంలో తమ జీవితాన్ని అంకితం చేసిన ధైర్యవంతులైన అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేయాలనే లక్ష్యంతో తానా అట్లాంటా టీమ్ సేవ చేసేవారికి తమవంతు సేవ చేయడం అన్న భావనతో ఓ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
టాలీవుడ్ ప్రతిభను ఇంటా బయటా ప్రతిబింబించే దుబాయి కేంద్రంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రతిష్టాత్మమైన జీఏఎమ్ఏ అవార్డుల కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
దళారుల మాటలు నమ్మి దుబాయి వెళ్లిన గోదావరి యువకులు ఇక్కట్ల పాలయ్యారు. నిలువ నీడ కూడా లేకుండా ఉన్న తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
జులైలో జరగనున్న తానా మహాసభలను పురస్కరించుకుని అమెరికాలోని వివిధ నగరాల్లో తానా పోటీలు జరుగుతున్నాయి. తాజాగా లాస్ ఏంజెలెస్‌లోని నిర్వహించిన ధీమ్ తానా పోటీలు వైభవంగా జరిగాయి.
భక్తుల సౌకర్యార్థం విదేశాల్లో కూడా వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఏపీ సీఎం సూచనల మేరకు ఈ చర్యలు తీసుకుంటామని చెప్పారు.