Share News

TANA Pathashala Fest: అమెరికాలో తెలుగు భాష బోధనకు తానా కృషి

ABN , Publish Date - Aug 18 , 2025 | 06:42 PM

మినియాపోలిస్ ఇండియా ఫెస్ట్‌లో భాగంగా 79వ భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాల సంబరాల్లో తానా నార్త్ సెంట్రల్ టీం పాల్గొని తానా పాఠశాల సభ్యత్వం నమోదు విశిష్టత తెలుపుతూ కార్యక్రమం నిర్వహించారు.

TANA Pathashala Fest: అమెరికాలో తెలుగు భాష బోధనకు తానా కృషి
TANA Pathashala India Fest

ఇంటర్నెట్ డెస్క్: మినియాపోలిస్ ఇండియా ఫెస్ట్‌లో భాగంగా 79వ భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాల సంబరాల్లో తానా నార్త్ సెంట్రల్ టీం (Tana North Central Team) పాల్గొని తానా పాఠశాల సభ్యత్వం నమోదు విశిష్టత తెలుపుతూ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తానా పాఠశాల నార్త్ సెంట్రల్ కో ఆర్డినేటర్ నాగరాజు మల్లెంపాటి (Tana North Central Coordinator Nagarju Mallempati) ప్రసంగించారు.

TANA-Pathashala-India-Fes-4.jpg


ఈ పాఠశాల ముఖ్య ఉద్దేశ్యం అమెరికాలో తెలుగు పిల్లలకు సరళమైన తెలుగు నేర్పించి, మన తెలుగు భాష మన భావితరాలకు అందిచాలనే ఈ ప్రయత్నం అంటూ అమెరికాలో ఉంటున్న మన తెలుగు వారు, వారి పిల్లలను ఈ సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతున్న తరగతుల్లో చేర్పించాలని సూచించారు.

TANA-Pathashala-India-Fes-3.jpg


ఈ కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి, తానా ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు (Tana Executive Vice President Srinivas Lavu), తానా పాఠశాల చైర్మన్ (Tana Pathashala Chairmen Bhanu Manguluri) వారి ప్రోద్బలంతో తానా నార్త్ సెంట్రల్ రిప్రజెంటివ్ రామ్ వాణికా (Tana North Central Representative Ram Vankina), తానా నార్త్ సెంట్రల్ టీం అజయ్ తాళ్లూరి (Tana North Central team Ajay Talluri), వేదవ్యాస్ అర్వపల్లి (Vedavyas Arvapalli), వెంకట్ జువ్వా (Venkat Juvva), తానా పాఠశాల విద్యార్థులు , తల్లితండ్రులు పాల్గొని విజయవంతం చేశారని తానా పాఠశాల నార్త్ సెంట్రల్ కో ఆర్డినేటర్ నాగరాజు మల్లెంపాటి పేర్కొన్నారు.

TANA-Pathashala-India-Fest1.jpg


TANA-Pathashala-India-Fest-.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

తానా పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఎడారి జలవనరుల విధాన పరిశీలనకు రండి.. ఏపీ మంత్రికి ఎన్నారై ఆహ్వానం

Read Latest and NRI News

Updated Date - Aug 18 , 2025 | 06:49 PM