Share News

Frisco: ఫ్రిస్కోలో సాకేత్ ఫౌండేషన్ వార్షిక 5కే వాక్.. 13 లక్షల విరాళం సేకరణ

ABN , Publish Date - Aug 17 , 2025 | 03:36 PM

సాకేత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రిస్కోలో 5కే వాక్ జరిగింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ఎన్నారైలు సుమారు రూ.13 లక్షల విరాళాలు అందజేశారు.

Frisco: ఫ్రిస్కోలో సాకేత్ ఫౌండేషన్ వార్షిక 5కే వాక్.. 13 లక్షల విరాళం సేకరణ
Saketh Foundation 5K Walk

ఎన్నారై డెస్క్: బీటా థలస్సీమియా మేజర్‌తో పోరాడిన సాకేత్ కొల్లా స్మారకార్థం సాకేత్ ఫౌండేషన్ వార్షిక 5కే వాక్ శనివారం నాడు ఫ్రిస్కో కామన్స్ పార్కులో నిర్వహించారు. ప్రవాసులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విరాళాలు అందజేశారు. ఈ వాక్ ద్వారా ₹13లక్షలు(15వేల డాలర్లు) అందినట్లు సాకేత్ తల్లిదండ్రులు శ్రీనివాస్-లక్ష్మీలు తెలిపారు. సాకేత్ స్ఫూర్తిని స్మరించుకుంటూ, భారతదేశంలోని ఆర్థికంగా వెనుకబడిన పిల్లల ఆరోగ్యం, విద్య కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాది సాకేత్ ఫౌండేషన్ 5కే వాక్ 14వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. మరిన్ని వివరాలకు www.sakethfoundation.org వెబ్‌సైట్‌ను చూడవచ్చు.


3.jpg2.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

తానా పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఎడారి జలవనరుల విధాన పరిశీలనకు రండి.. ఏపీ మంత్రికి ఎన్నారై ఆహ్వానం

Read Latest and NRI News

Updated Date - Aug 17 , 2025 | 10:17 PM