Share News

Tana: రైతు కోసం తానా.. రైతులకు టార్ఫాలిన్స్

ABN , Publish Date - Aug 21 , 2025 | 05:16 PM

తానా అద్యక్షుడు నరెన్ కొడాలి, తానా కొశాధికారి రాజ కసుకుర్తి అధ్దర్యంలో తెలుగు రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.

Tana: రైతు కోసం తానా.. రైతులకు టార్ఫాలిన్స్
Tana For Farmers

తెలుగు ప్రజలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించటానికి ముందుంటానని తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) మరోసారి చాటి చెప్పింది. తానా అద్యక్షుడు నరెన్ కొడాలి, తానా కొశాధికారి రాజ కసుకుర్తి అధ్దర్యంలో తెలుగు రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.

tana2.jpg


'రైతు కోసం తానా' పేరుతో టార్పాలిన్స్, పవర్ స్ప్రేయర్స్‌ను తానా సంఘం అందించింది. కూళ్ళ గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు చిట్టూరి వెంకట సూర్యప్రకాశ్‌రావు చౌదరి తన 80వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని రైతులకు టార్పాలిన్స్ బహుకరించారు. పంటలు చేతికొచ్చే సమయంలో వచ్చే వానల వల్ల ఇబ్బందులు పడే రైతులకు ఈ టార్పాలిన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని గ్రామస్తులు తెలియజేశారు.

tana3.jpg


తానా చేసే ఇటువంటి సేవా కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వారు ఇలాంటి మరిన్ని ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని పలువురు అతిథులు ఆకాంక్షించారు

tana4.jpg

Updated Date - Aug 21 , 2025 | 05:16 PM