Share News

New York India Day Parade: న్యూయార్క్ ఇండియా పరేడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి

ABN , Publish Date - Aug 19 , 2025 | 08:50 PM

ప్రపంచంలో అతి పెద్దదైన న్యూ యార్క్ ఇండియా పరేడ్ వేడుకలో భాగంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా పాల్గొంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు జీరో ప్లాస్టిక్ గురించి సందేశం ఇచ్చారు. సభ్యులు గర్వంగా, ఉత్సాహంగా జెండాలను ఊపుతూ 85 డిగ్రీల వేడిలో రెండు మైళ్లదూరం నడిచారు.

New York India Day Parade: న్యూయార్క్ ఇండియా పరేడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి
New York India Day Parade

ప్రపంచంలో అతి పెద్దదైన న్యూ యార్క్ ఇండియా పరేడ్ (New York India Day Parade) వేడుకలో భాగంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) పాల్గొంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు (TANA) ‘జీరో ప్లాస్టిక్’ గురించి సందేశం ఇచ్చారు. సభ్యులు గర్వంగా, ఉత్సాహంగా జెండాలను ఊపుతూ 85 డిగ్రీల వేడిలో రెండు మైళ్లదూరం నడిచారు. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ సభ్యులు, జనసందోహం అలసిపోకుండా కార్యక్రమంలో పాల్గొన్నారు. సభ్యుల స్ఫూర్తి, అంకితభావం సమాజం, మాతృభూమి పట్ల వారి ప్రేమను ప్రతిబింబించాయి. 50 వసంతాలు చేరువ అవుతున్నఉత్తర అమెరికా తెలుగు సంఘాన్ని (TANA) చూడగానే జనసందోహం తమ ఆనందం వ్యక్తం చేశారు.

TANA.jpg


ఈ ఏడాది పరేడ్‌కి గ్రాండ్ మార్షల్స్‌గా పాన్ ఇండియా స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఈ వేడుకకు హాజరయ్యారు, మండుటెండలో నవ్వుతూ అందరికీ అభివాదం చేశారు. ప్రపంచంలో అతి పెద్దయిన న్యూ యార్క్ ఇండియా పరేడ్‌లో సంబురాల అనంతరం తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఓరుగంటి, సతీష్ మేక ముందు తరానికి ఉత్సాహాన్ని ఇచ్చేలా మాట్లాడారు. భారతదేశం, అమెరికాలోని తెలుగు ప్రజలకు అవసరమైన కార్యక్రమాల గురించి వారు వివరించారు.

TANA-3.jpg


ఈ సందర్భంగా తానా స్పెషల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి మాట్లాడారు. తాము ఆడంబరానికి పోకుండా దాతలు ఇచ్చే ప్రతి పైసా పలు ప్రాజెక్టులకు నిస్వార్ధంగా వినియోగిస్తున్నామని తెలిపారు. అలాగే తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్, అమెరికన్ స్కూల్ కమిటీ సభ్యులు కృష్ణ ప్రసాద్ సోంపల్లి మాట్లాడారు. ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌‌లో కేవలం పాల్గొనటమే కాకుండా మన సమాజానికి స్ఫూర్తి ఇచ్చేలా కార్యక్రమం ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రపంచంలో అతి పెద్దయిన న్యూ యార్క్ ఇండియా పరేడ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు, న్యూ జెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ సుధీర్ చంద్ నారెపలేపు, న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మణికొండ, వలంటీర్స్ నిశాంత్ కొల్లి సాయి మిన్నకంటి, వినయ్ కూచిపూడి, రావు యలమంచలి, ప్రసాద్ కోయెలు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

TANA-1.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

తానా పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఎడారి జలవనరుల విధాన పరిశీలనకు రండి.. ఏపీ మంత్రికి ఎన్నారై ఆహ్వానం

Read Latest and NRI News

Updated Date - Aug 19 , 2025 | 09:04 PM