Share News

US Visa Revocation: వలసలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి.. 6 వేల వీసాల రద్దు

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:49 PM

ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకూ 6 వేల పైచిలుకు స్టూడెంట్ వీసాలు రద్దు చేసినట్టు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. చట్ట ఉల్లంఘనలు మొదలు ఉగ్రవాదానికి మద్దతు తెలపడం వరకూ పలు కారణాలతో ఈ వీసాలు రద్దు చేసినట్టు తెలిపింది.

US Visa Revocation: వలసలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి.. 6 వేల వీసాల రద్దు
Trump Student Visa Revocation

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకూ 6 వేల పైచిలుకు స్టూడెంట్ వీసాలను రద్దు చేసినట్టు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీసా గడువు ముగిసినా దేశంలో ఉండటం, ఇతర చట్ట ఉల్లంఘనలు, ఉగ్రవాదానికి మద్దతు పలకడం తదితర కారణాలతో వీసాలను రద్దు చేసినట్టు తెలిపింది.

విదేశాంగ శాఖ ప్రకటన ప్రకారం, చట్టాన్ని ఉల్లంఘించినందుకు సుమారు 4 వేల వీసాలను రద్దు చేశారు. ఇందులో అధిక శాతం దాడుల నేరానికి సంబంధించినవని ఓ అధికారి తెలిపారు. మద్యం మత్తులో డ్రైవింగ్, డ్రగ్స్, చోరీ కేసుల్లో చిక్కుకున్న వారి వీసాలను రద్దు చేశారు. ఉగ్రవాదానికి మద్దతు తెలిపిన కారణంగా సుమారు 300 వరకూ విదేశీ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి.


వలసలపై తన విధానాలకు అడ్డుపడుతున్న టాప్ యూనివర్సిటీలపై కూడా ట్రంప్ తగాదాకు దిగిన విషయం తెలిసిందే. యూదు వ్యతిరేకతకు కొన్ని యూనివర్సిటీలు ఆలవాలంగా మారాయంటూ మండిపడ్డారు. అమెరికా విదేశాంగ విధానానికి ఇది విరుద్ధమంటూ కఠిన చర్యలకు ఉపక్రమించారు. స్టూడెంట్ వీసాల జారీని కూడా ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది. సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను కూడా జల్లెడపట్టాకే విదేశీయులకు వీసాలు జారీ చేయాలని వివిధ దేశాల్లోని అమెరికన్ ఎంబసీలు, కాన్సులేట్‌లకు ఆదేశాలు జారీ చేసింది.ఇప్పటికే అమెరికాలో ఉన్న విదేశీయులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే మరో ఆలోచన లేకుండా వారి వీసాలను రద్దు చేసి స్వదేశానికి డిపోర్టు చేస్తోంది. గ్రీన్‌కార్డు ఉన్న విదేశీయులనూ అమెరికా ప్రభుత్వం టార్గెట్ చేసింది.


ఇదిలా ఉంటే, ఫ్లోరిడాలో ఓ భారతీయుడి నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదం రాజకీయంగా వివాదం రాజేసింది. అక్రమంగా దేశంలోని ప్రవేశించిన హర్జీందర్ సింగ్ అనే వ్యక్తికి కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ట్రంప్ సర్కారు ఆరోపించింది. ట్రంప్ హయాంలోనే హర్జీందర్ సింగ్ అమెరికాలోకి అక్రమంగా కాలుపెట్టాడని, ఆ సమయంలో ఫెడరల్ ప్రభుత్వం అతడికి నివాసానుమతి కల్పించిందని కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయం ప్రతిదాడికి దిగింది.


ఈ వార్తలు కూడా చదవండి:

భారతీయ ట్రక్ డ్రైవర్ నిర్వాకం.. రోడ్డు ప్రమాదంపై ట్రంప్ ప్రభుత్వం ఫైర్

తానా పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Read Latest and NRI News

Updated Date - Aug 19 , 2025 | 01:00 PM