Home » Nirmala Sitharaman
కేంద్ర బడ్జెట్ అనగానే అందరిలో మొదటగా మెదిలే ప్రశ్న ఒకటుంటుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? వేటి ధరలు తగ్గుతాయి? అనే విషయాన్ని గమనిస్తూ ఉంటారు. కేంద్రం బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయాలు, పన్నుల మినహాయింపులు, సుంకాలు, జీఎస్టీ రేట్లల్లో సవరణలతోనే వస్తువుల ధరల్లో మార్పులు వస్తాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న(ఆదివారం) కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాదితో ఆమె వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్‌పై ప్రసంగించనున్నారు.
ప్రస్తుతం సగటు భారతీయుని ధ్యాసంతా రానున్న ఆదివారం మీదే ఉంది. ఆ రోజు సెలవు దినం అయినప్పటికీ.. యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవడమే ఇందుకు కారణం. మరి ఆ రోజే ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.. స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏంటో ఓసారి చూస్తే...
రికార్డ్ స్థాయిలో వరుసగా తొమ్మిదోసారి యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్. ఇదే ఓ మైలురాయి కానుండగా.. బడ్జెట్ ప్రసంగం ద్వారా ఆమె ఈసారి కొత్త రికార్డులు సృష్టించే అవకాశముంది. ఆ రికార్డుల విశేషాలు ఏమిటంటే...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో రికార్డు అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆమె అనుభవాన్ని, ఒకే ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆమె వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఓ అరుదైన రికార్డును సృష్టించబోతున్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డును సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1 బడ్జెట్‌తో వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా గుర్తింపు సొంతం చేసుకోనున్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఎకనమిక్ సర్వే-2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2026-27లో భారత జీడీపీ 6.8 నుంచి 7.2 శాతం మేర వృద్ధి సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనావేసే ఆర్థిక సర్వేను నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. వివరాల్లోకి వెళితే..
బడ్జెట్ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఏటా నిర్వహించే హల్వా వేడుక మంగళవారం సాయంత్రం నార్త్ బ్లాక్‌లో జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌధరీ ఈ వేడుకలో పాల్గొన్నారు.