Share News

నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ హల్వా వేడుక.. వారంతా ఐదు రోజుల పాటు అక్కడే..

ABN , Publish Date - Jan 27 , 2026 | 08:34 PM

బడ్జెట్ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఏటా నిర్వహించే హల్వా వేడుక మంగళవారం సాయంత్రం నార్త్ బ్లాక్‌లో జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌధరీ ఈ వేడుకలో పాల్గొన్నారు.

నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ హల్వా వేడుక.. వారంతా ఐదు రోజుల పాటు అక్కడే..
Halwa ceremony 2026

న్యూఢిల్లీ, జనవరి 27: కేంద్ర బడ్జెట్ 2026 - 27కు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకుంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఏటా నిర్వహించే హల్వా వేడుక మంగళవారం సాయంత్రం నార్త్ బ్లాక్‌లో జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌధరీ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆర్థిక శాఖ పరిధిలోని అన్ని విభాగాల కార్యదర్శులు, బడ్జెట్ తయారీలో భాగమైన అధికారులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.


5 రోజుల పాటు ఒకే చోట

ప్రతీ ఏటా హల్వా వేడుకతో బడ్జెట్ లాక్ ఇన్ పీరియడ్ మొదలవుతుంది. బడ్జెట్ తయారీలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులు, సిబ్బంది.. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఆ నార్త్ బ్లాక్‌లోనే ఉంటారు. వారు బయటకు వెళ్లడానికి అవకాశం ఉండదు. సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది నిఘాలో ఉంటారు. ఫోన్ చేయడానికి కూడా వీలుండదు. ఐదు రోజుల పాటు అక్కడే ఉండాల్సి ఉంటుంది. పార్లమెంట్‌లో బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తయిన తర్వాత వారు బయటకు వస్తారు. 1950లో బడ్జెట్ ప్రింటింగ్ ప్రాసెస్ కొనసాగుతున్న సమయంలో జరిగిన లీక్ కారణంగా లాక్ ఇన్ పద్ధతి మొదలైంది.


ఇవి కూడా చదవండి

రివర్స్‌గేర్ వేయలేం... వీబీ-జీ రామ్ జీ చట్టంపై కిరణ్ రిజిజు

ఆకలి తీరాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే.. ఓ పండు కోసం కోతి ఎంత సాహసం చేసిందో చూడండి..

Updated Date - Jan 27 , 2026 | 09:15 PM