ఆకలి తీరాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే.. ఓ పండు కోసం కోతి ఎంత సాహసం చేసిందో చూడండి..
ABN , Publish Date - Jan 27 , 2026 | 08:07 PM
అడవిలో జంతువులు ఎప్పుడూ ఆకలితో పోరాటం చేస్తూనే ఉంటాయి. ఆహారం సంపాదించుకోవడమే వాటి మొదటి ప్రాధాన్యం. ఆహారం కోసం అవసరమైతే వాటి ప్రాణాలను కూడా పణంగా పెట్టాలి. క్రూర జంతువులు తమ ఆహారం కోసం వేటపై ఆధారపడితే.. సాధు జంతువులు చెట్లపై ఆధారపడతాయి.
అడవిలో జంతువులు ఎప్పుడూ ఆకలితో పోరాటం చేస్తూనే ఉంటాయి. ఆహారం సంపాదించుకోవడమే వాటి మొదటి ప్రాధాన్యం. ఆహారం కోసం అవసరమైతే వాటి ప్రాణాలను కూడా పణంగా పెట్టాలి. క్రూర జంతువులు తమ ఆహారం కోసం వేటపై ఆధారపడితే.. సాధు జంతువులు చెట్లపై ఆధారపడతాయి. ప్రస్తుతం ఓ కోతికి సంబంధించిన థ్రిల్లింగ్ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చెట్టు చివరన ఉన్న ఓ పండు కోసం కోతి ఎంత సాహసం చేసిందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే (hungry monkey viral video).
@riya21314 అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కోతి ఒక పండు కోసం ఎండిపోయిన చెట్టు ఎక్కింది. బాగా ఎత్తుగా ఉన్న ఆ ఎండిపోయిన చెట్టు చిటారు కొమ్మన ఆ పండు ఉంది. అక్కడకు కోతి నెమ్మదిగా చేరుకుంది. అయితే పండు ఉన్న చోటుకు వెళ్తే ఎదురయ్యే ప్రమాదాన్ని కోతి గ్రహించింది. ఒక కొమ్మను తన కాలితో పట్టుకుని ఆ పండును కోయడానికి ప్రయత్నించింది. ఆ పండును తెంపడం సాధ్యం కాకపోవడంతో దానిని అక్కడే తినడం ప్రారంభించింది (monkey reaching for fruit).
ఆ కోతి సాహసాన్ని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (monkey bravery video). ఇప్పటివరకు పది వేల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. చాలా మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అడవి జంతువులకు ఆహారం సంపాదించడం అంటే ప్రాణాలతో చెలగాటం అని ఒకరు కామెంట్ చేశారు. 'మానవులు మాత్రమే కాదు, జంతువులు కూడా ఆకలి ముందు నిస్సహాయంగా మారిపోతాయి' అని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
సూపర్.. మార్కెటింగ్ అంటే ఇలా ఉండాలి.. ప్లాస్టిక్ టబ్‌లు ఇంత గట్టిగా ఉంటాయా..
చిలుకల మధ్యలో సీతాకోక చిలుక.. 15 సెకెన్లలో ఆ సీతాకోకచిలుకను కనిపెట్టండి..