Union Budget 2026: గుడ్‌న్యూస్.. హోమ్‌లోన్ వడ్డీ రాయితీ రూ.5 లక్షలకు పెంచనున్నారా..
ABN , Publish Date - Jan 16 , 2026 | 02:54 PM
దేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వడం, గృహ నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెంచడం కోసం.. కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని నిఫుణులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా హోమ్‌లోన్ వడ్డీ రాయితీ రూ.5 లక్షలకు పెంచే అవకాశముందంటున్నారు.
ఆంధ్రజ్యోతి, జనవరి 16: కేంద్ర బడ్జెట్ 2026లో గృహ రుణాల మీద వడ్డీ రాయితీ రూ.5 లక్షలకు పెంచనున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దీనికి తోడు ఆర్థిక రంగ నిఫుణులు సైతం దీనికి సానుకూలంగా స్పందిస్తుండటంతో మధ్యతరగతి ప్రజల ఆశలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హోమ్‌లోన్ తీసుకున్నవారు, కొత్తగా ఇల్లు కొనాలని భావిస్తున్నవారి కోసం.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) కింద స్వీయ వినియోగ గృహాలపై హోమ్‌లోన్ వడ్డీపై గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు మాత్రమే పన్ను రాయితీ అందుతోంది.
అయితే.. పెరుగుతున్న ఇళ్ల ధరలు, అధిక వడ్డీ రేట్లు, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ఈ రాయితీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇది అమలైతే నెలవారీ EMI భారం తగ్గడంతో పాటు మధ్య తరగతి కుటుంబాలకు గణనీయమైన పన్ను లాభం కలగనుంది.
రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వడం, గృహ నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెంచడం కూడా ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మొదటిసారి ఇల్లు కొనేవారికి ఇది పెద్ద ప్రోత్సాహకంగా మారే అవకాశముంది.
బడ్జెట్ 2026లో కేంద్రం నిజంగా ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. హోమ్‌లోన్ దారులకు ఇది గుడ్‌న్యూస్ అవుతుందనే చెప్పాలి. దీంతో ఇప్పుడు చాలా మంది దృష్టి ఫిబ్రవరి 1న వచ్చే బడ్జెట్ ప్రకటనలపైనే నిలిచింది.
ఇవి కూడా చదవండి..
జస్టిస్ యశ్వంత్ వర్మకు దక్కని ఊరట.. విచారణకు తొలగిన అడ్డంకి
జమ్మూ సరిహద్దులో డ్రోన్ల కలకలం.. భారత్ సైన్యం అలర్ట్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి