Home » New Delhi
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా ప్రతివారం నిర్వహించే జన్ సున్‌వాయి ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఒక వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. .
విపక్ష కూటమి నిర్ణయంతో కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఎన్.చంద్రబాబునాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీని డైలమాలో పడేసే అవకాశం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. టీడీపీ నాయకత్వం ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మద్దతు ప్రకటించింది.
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపీలకు మోదీ పరిచయం చేశారు. ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన సరళ స్వభావి, నిబద్ధత కలిగిన నేత అని రాధాకృష్ణన్‌ను ప్రశంసించారు.
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు ప్రతిపక్షాలు మద్దతివ్వాలని ప్రధానమంత్రి మోదీ కోరారు. ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
రాజకీయ పార్టీలు లేవనెత్తిన కీలక ప్రశ్నలకు సీఈసీ జ్ఞానేష్ కుమార్ సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని, ఆయన తన బాధ్యతల నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ఓటు హక్కు అనేది పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రధానమైన హక్కు అని, దానికి పరిరక్షించేందుకు ఉద్దేశించినదే ఈసీ అని చెప్పారు.
లోక్‌సభలో ఇవాళ ప్రతిపక్ష ఎంపీలు గందరగోళం సృష్టించారు. ఒక దశలో నిరసనలు, నినాదాలు మిన్నంటడంతో స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నినాదాలు చేస్తున్న ఎనర్జీతో ప్రశ్నలడిగితే దేశ ప్రజలకు..
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా ఉన్న వాంగ్ యి తన పర్యటనలో భాగంగా జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ డోభాల్‌ను కూడా కలుసుకుంటారు. చైనా-భారత్ సరిహద్దు సమస్యలపై ఈ భేటీలో చర్చలు జరుపుతారని ఇండియాలో చైనా రాయబారి జీ ఫీహోంగ్ తెలిపారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిసీటీవీ ఫుటేజ్‌ను షేర్ చేయకపోవడానికి ఓటర్ల ప్రైవేసీని కాపాడాలన్నదే కారణమని సీఈసీ చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్‌ను ఎన్నికల కమిషన్ షేర్ చేయకపోవడంపై రాహుల్ గాంధీ సారథ్యంలోని పలు వివక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ఏ పార్టీ అయినా పుడుతుందని సీఈసీ జ్ఞానేష్ కుమార్ అన్నారు. అలాంటప్పుడు రాజకీయ పార్టీలపై ఎన్నికల కమిషనర్ ఎలా వివక్ష చూపిస్తుందని ప్రశ్నించారు.
ఆగస్టు మాసం ఫ్రీడం, రివల్యూషన్ రంగులతో కలర్‌ఫుల్‌గా ఉందని ప్రధాని అన్నారు. ఈరోజు ఢిల్లీలో అభివృద్ధి రివల్యూషన్ కనిపిస్తోందన్నారు. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్డు అనుసంధానమయ్యాయని చెప్పారు.