Share News

Delhi Explosion: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు.. అనుమానితుడి అరెస్టు

ABN , Publish Date - Nov 10 , 2025 | 09:09 PM

ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్-1 సమీపంలో పేలుడు ఘటనలో పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 10 మంది మరణించగా మరో 24 మంది గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు ముంబై, హైదరాబాద్‌లో పోలీసులు హైలర్ట్ ప్రకటించారు.

Delhi Explosion: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు.. అనుమానితుడి అరెస్టు
Delhi Blast Incident one Suspect in Police custody

ఇంటర్నెట్ డెస్క్: దేశరాజధాని ఢిల్లీలోని ఎర్ర కోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం సంభవించిన భారీ పేలుడుతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. మెట్రో స్టేషన్ గేట్-1 పార్కింగ్ స్థలం వద్ద కారులో అకస్మాత్తుగా ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. పేలుడు ధాటిని మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తాజాగా ఒకరిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం (Delhi Blasts Case One Suspect In Custody).


ఘటనకు కారకులు ఎవరో తేల్చేందుకు ఇప్పటికే ఢిల్లీ పోలీసు డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. క్లూస్ టీమ్, జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పేలుడు ధాటికి గాయపడ్డ వారిని స్థానిక ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సాయంత్రం 6.55 గంటల సమయంలో పేలుడు సంభవించినట్టు అగ్నిమాపక శాఖ తెలిపింది.


ఇవి కూడా చదవండి..

ఎర్రకోట దగ్గర భారీ పేలుడు..

ఢిల్లీ సమీపంలో భారీగా ఆయుధాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 10 , 2025 | 09:19 PM