Share News

PM Modi: కాంగ్రెస్ హయాంలో కుప్పలు, తెప్పలుగా నిరర్ధక ఆస్తులు.. మోదీ

ABN , Publish Date - Oct 17 , 2025 | 09:29 PM

ఇది పండుగల సీజన్ అని ప్రధాని మోదీ పేర్కొంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి తరుణంలో 'అన్‌స్టాపబుల్ భారత్' పేరుతో ప్రపంచ సదస్సు ఏర్పాటు చేయడం సందర్భానికి తగినట్టుగా ఉందని, ఇండియా ఎక్కడా అగకుండా ముందుకు సాగే మూడ్‌లోనే ఉందని చెప్పారు.

PM Modi: కాంగ్రెస్ హయాంలో కుప్పలు, తెప్పలుగా నిరర్ధక ఆస్తులు.. మోదీ
PM Modi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ హయాంలో కుప్పతెప్పలుగా నిరర్ధక ఆస్తులు (non-permorming assests) పేరుకుపోయేవని, బ్యాంకులకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే వారని, ప్రభుత్వ సబ్సిడీల నుంచి తప్పించుకునేందుకు రోజుకు 12 గంటలపాటు పెట్రోల్ బంక్‌లు కూడా మూసుండేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో శుక్రవారం నాడు జరిగిన సదస్సులో 'అన్‌స్టాపుబుల్ ఇండియా' అనే థీమ్‌పై ప్రధాని మాట్లాడారు. ఈ సదస్సులో శ్రీలంక ప్రధానమంత్రి హరిణి అమరసూర్య, యూకే మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ సహా పలువురు ప్రస్తుత, మాజీ ప్రపంచ నేతలు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ, గతంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన నిరర్ధక ఆస్తుల పరిస్థితిని అదుపు చేసేందుకు తాము కార్యచరణను చేపట్టామని, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తెచ్చామని చెప్పారు. డిజిటల్ లావాదేవీల్లో ఇండియాను ఆర్థికంగా అత్యంత సమ్మళిత దేశాల్లో ఒకటిగా తీర్జిదిద్దామని తెలిపారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ప్రంపచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాల్లో ఒకటని వివరించారు.


'ఒకప్పుడు పేద ప్రజలు బ్యాంకులకు వెళ్లాలంటేనే భయపడేవారు. మేము బాధ్యతలు తీసుకునేంత వరకూ దేశ జనాభాలో సగం మందికి బ్యాంకు అకౌంట్లు కూడా లేవు. బ్యాంకింక్ వ్యవస్థను మేము ప్రజాస్వామ్యీకరించాం. మిషన్ మోడ్‌లో 50 కోట్లకు పైగా జన్ ధన్ అకౌంట్లను తెరిపించాం' అని అన్నారు.


ఇది పండుగల సీజన్ అని ప్రధాని మోదీ పేర్కొంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి తరుణంలో 'అన్‌స్టాపబుల్ భారత్' పేరుతో ప్రపంచ సదస్సు ఏర్పాటు చేయడం సందర్భానికి తగినట్టుగా ఉందని, ఇండియా ఎక్కడా ఆగకుండా ముందుకు సాగే మూడ్‌లోనే ఉందని చెప్పారు. గత 11 ఏళ్లుగా ఇండియా ఎన్నో అవరోధాలు అధిగమించి ముందుకు వెళ్లిందని, ప్రపంచంలోని ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి నిలిచిందని చెప్పారు. ఇప్పుడు భారత్ సైలెంట్‌గా ఉండబోవడం లేదని, సర్జికల్ దాడులు, ఎయిర్‌స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్‌తో గట్టి జవాబు ఇస్తోందని చెప్పారు. కొవిడ్ సమయంలో ఇండియా ఎలా గట్టెక్కుతుందని అంతా అనుకున్న దశలో ఆ ఆలోచన తప్పని రుజువు చేశామని చెప్పారు. సవాళ్లను ఎదుర్కొని, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలబడ్డామని అన్నారు. గత మూడేళ్లలో దేశ ఆర్థిక వృద్ధి యావరేజ్‌గా 7.8 శాతం ఉందని, రెండ్రోజుల క్రితమే ఎగుమతులు 7 శాతం పెరిగినట్టు మన ఎగుమతుల గణాంకాలకు బయటకు వచ్చాయని చెప్పారు. భారత్ వృద్ధి పెరుగుతోందని ఐఎంఎఫ్ ప్రశంసించిదని, మరుసటి రోజు గూగుల్ భారీ పెట్టుబడుల ప్రకటన చేసిందని తెలిపారు. ఇంధనం, సెమీ కంటెక్టర్ల రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. యూకే ప్రధాని స్టార్మర్ అతిపెద్ద ప్రతినిధి బృందంతో ఇండియాకు వచ్చారని, ఇండియాలో అవకాశాలను ప్రపంచం గుర్తించిందని, బాధ్యత గల భాగస్వామిగా ప్రపంచం భారత్‌ను చూస్తోందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

గాంధీనే విడిచి పెట్టలేదు, నేనెంత... ఆర్ఎస్ఎస్‌పై నిప్పులు చెరిగిన ప్రియాంక్ ఖర్గే

ఇన్ఫోసిస్‌లో ఉన్నంత మాత్రాన వాళ్లకి అన్నీ తెలుసా.. సిద్ధరామయ్య మండిపాటు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 17 , 2025 | 10:05 PM