Home » New Delhi
యావత్ ప్రపంచంలో వివిధ రకాల పూలతో ప్రకృతిని పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ.. అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ బిడ్డలందరీ జీవితాల్లో వెలుగు నింపేదని పేర్కొన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఈ కొత్త కార్యాలయం ఏర్పాటు కాగా, ప్రస్తుతం పండిట్ పంత్ మార్గ్ నుంచి పని చేస్తు్న్న ఢిల్లీ బేజీపీ కార్యాలయం ఇక నుంచి దీన్ దయాల్ ఉపాధ్యాయ్ మార్గ్ నుంచి పనిచేయనుంది.
మావోయిస్టుల కాల్పుల విరమణ ఆఫర్ను స్వాగతిస్తున్న వారిపై అమిత్షా మండిపడ్డారు. వామపక్ష తీవ్రవాదంపై చేపట్టిన 'ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్'ను ఆపేయాలని ఇటీవల వామపక్షాలు ముఖ్యంగా సీపీఐ, సీపీఐ-ఎంలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయని చెప్పారు.
విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఢిల్లీ బాబా వేర్వేరు పేర్లతో బ్యాంకు ఖాతాలు నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలియగానే ఆయన రూ.50 లక్షలు విత్డ్రా చేసినట్టు గుర్తించారు.
ఢిల్లీకి చెందిన ఓ బాబాపై లైంగిక ఆరోపణల కేసు విచారణలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బేబీ, లవ్ యూ అంటూ బాబా అసభ్యకర వాట్సాప్ మెసేజీలను పెట్టిన మాట వాస్తవమేనని అధికారులు పేర్కొన్నారు.
జనాభాలో ఉద్యోగ ఉపాధి పొందే వయసున్న వారి వాటా అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. అక్కడ 15 -59 ఏళ్ల వయసున్న వారి వాటా 70.8 శాతం. ఆ తరువాతి స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు నిలిచాయి.
ఇటీవల ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచామని, దానితోపాటు ఇప్పుడు జీఎస్టీ సంస్కరణల వల్ల దేశ ప్రజల పొదుపు రూ.2.5 లక్షల కోట్లకు చేరుతుందని ప్రధాని మోదీ చెప్పారు. భిన్న రకరకాల పన్నుల నుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పించి, ఏకీకృత వ్యవస్థను ప్రవేశపెట్టామని తెలిపారు.
ఏబీవీపీ కీలకమైన మూడు పోస్టులు సొంత చేసుకుంది. అధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులను కైవసం చేసుకుంది. ఎన్ఎస్యూఐకి ఒక్క వైస్ ప్రెసిడెంట్ పదవి మాత్రమే తక్కింది.
ఇండియా-పాకిస్థాన్ 2025 ఆసియా క్రికెట్ మ్యాచ్ కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు ఢిల్లీలో తీవ్ర నిరసన తెలిపారు. టీవీలు పగలకొట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎం. వెంకయ్యనాయుడు పక్కనే ధన్ఖడ్ కూర్చుని ఆయనతో సంభాషించడం కనిపించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు రాక సందర్భంగా ఆయన నవ్వుతూ గ్రీట్ చేశారు.