Advocate Rakesh Kishore: మాజీ సీజేఐ మీద షూ విరిసిన లాయర్‌పై చెప్పుతో దాడి
ABN , Publish Date - Dec 09 , 2025 | 06:19 PM
అడ్వకేట్ కిషోర్‌పై దాడికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. అయితే ఈ ఘటనపై కిషోర్ స్పందిస్తూ 30 నుంచి 35 ఏళ్లు వయసున్న ఒక యువ అడ్వకేట్ తనపై చెప్పుతో దాడి జరిపినట్టు చెప్పారు. మాజీ సీజేఐపై దాడి చేసినందుకే తనను శిక్షించాలని అనుకున్నట్టు వారు చెప్పారన్నారు.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై గత అక్టోబర్‌లో షూ విసిరి దాడికి యత్నంచిన అడ్వకేట్ రాకేష్ కిషోర్ (Advocate Rakesh Kishore)పై మంగళవారం నాడు ఢిల్లీ కోర్టు ఆవరణలో దాడి జరిగింది. గవాయ్‌పై దాడి అనంతరం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. అడ్వకేట్ కిషోర్‌ను సస్పెండ్ చేసింది. అయితే, ఇందుకు సంబంధించి ఆయన నేడు కోర్టుకు వచ్చారు. ఆ విషయం తెలియడంతో కొందరు ఆయనపై చెప్పుతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అడ్వకేట్ కిషోర్‌పై దాడికి కారణం ఏమిటనేది వెంటనే తెలియరాలేదు. అయితే ఈ ఘటనపై కిషోర్ స్పందిస్తూ.. 30 నుంచి 35 ఏళ్లు వయసున్న ఒక యువ అడ్వకేట్ తనపై చెప్పుతో దాడి చేసినట్లు చెప్పారు. మాజీ సీజేఐపై దాడి చేసినందుకే తనను శిక్షించాలని అనుకున్నట్టు వారు చెప్పారన్నారు.
కాగా, గత అక్టోబర్ 6న ఒక పిల్ విచారణ సందర్భంగా సీజేఐ గవాయ్ చేసిన కామెంట్లను వ్యతిరేకిస్తూ అడ్వకేట్ కిషోర్ దాడికి యత్నించాడు. ఓ కేసు విచారిస్తున్న సమయంలో సీజేఐపై షూ విసిరాడు. అయితే, దాడిని గమనించిన జస్టిస్ గవాయ్ పక్కకు తొలగడంతో తన కుర్చీకి తలిగింది. తోటి లాయర్లను ఆయనను పట్టుకుని కోర్టు సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటన అనంతరం అడ్వకేట్ కిషోర్‌పై చర్యకు జస్టిస్ గవాయ్ నిరాకరించారు. అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాత్రం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఇవి కూడా చదవండి..
నకిలీ పత్రాల ద్వారా ఓటు హక్కు.. సోనియా గాంధీకి రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు..
ఇండిగోపై కఠిన చర్యలు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి కీలక ప్రకటన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి