Home » New Delhi
భారతదేశ అభివృద్ధిలో నారీ శక్తి పాత్ర ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రతి రంగంలోనూ మన ఆడకూతుళ్లు తమదైన ముద్ర వేసుకుంటున్నారని, ఆటంకాలు తొలగించుకుంటూ దూసుకు వెళ్తున్నారని, గగనతలంలోనూ తమ శక్తిసామర్థ్యాలను చాటుకుంటున్నారని ప్రశంసించారు.
మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీకి అహ్వానం అందలేదని కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరించాయి. కీలక దౌత్య ప్రముఖులు హాజరయ్యే కార్యక్రమంలో తమ నేతలకు ఆహ్వానం లేకపోవడంపై ఆ వర్గాల్లో చర్చ జరుగుతోంది
ఇండిగో విమాన సర్వీసుల సామూహిక రద్దుతో తలెత్తిన సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన ద్వైపాక్షిక సమావేశానంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఈ-టూరిస్ట్ వీసా, గ్రూప్ టూరిస్ట్ వీసా సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
ఉక్రెయిన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి పుతిన్ ప్రభుత్వం భారత్‌పై విశ్వాసం ఉంచి ప్రతి విషయాన్ని తమతో పంచుకుందని మోదీ అన్నారు. ఇరుదేశాల మధ్య నమ్మకం అనేది గొప్ప బలమని, ఇదే విషయాన్ని తాము పదేపదే చెబుతూ వచ్చామని, ప్రపంచానికి కూడా తెలియజేశామని అన్నారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరాల్సిన ఇండిగో విమానాలు అన్నీ నేటి అర్ధరాత్రి వరకూ రద్దయినట్టు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. అయితే, మధ్యాహ్నం మూడు గంటల వరకే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్టు డీజీసీఏ వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడం, తాజాగా ఎంసీడీలోని 12 వార్డులకు ఉపఎన్నికలు జరగడంతో ప్రజలు ఏపార్టీని ఆదరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
నార్త్ ఇండియాలో ఉంటున్న ఈ ముగ్గురు నిందితులకు ఐఎస్ఐ అసోయేటెడ్ టెర్రరిస్ట్ షెహజాద్ భట్టితో సంబంధాలున్నట్టు అధికారులు తెలిపారు.
డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలకమైన పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలికేందుకు ఉద్దేశించిన 'ది ఆటమిక్ ఎనర్జీ బిల్లు-2025'తో సహా 10 కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
బిహార్లో కాంగ్రెస్ పరాజయంపై ఇటీవల కూడా ఇందిరాభవన్లోనూ ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పరాజయానికి దారితీసిన పరిస్థితులపై ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థలను అడిగి తెలుసుకున్నారు.