వివాదాల నడుమ.. వందేమాతరంతో ఉర్రూతలూగించిన ఏఆర్ రెహమాన్
ABN , Publish Date - Jan 24 , 2026 | 08:31 PM
ఈనెల 23వ తేదీన యూఏఈలోని ఇతిహాద్ ఎరీనాలో ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ జరిగింది. ఇందులో ఆయన తన పాపులర్ సాంగ్స్‌తో పాటు 'వందేమాతరం' ఆలపించి జనాన్ని ఉర్రూతలూగించారు.
న్యూఢిల్లీ: ఆస్కార్ అవార్డు విజేత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rehman) ఇటీవల మతపరమైన వ్యాఖ్యలతో దుమారం రేపారు. సీనీ పరిశ్రమ తన 'మతం' కారణంగానే వివిక్ష చూపిస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వివాదం తీవ్రమవుతుండటంతో ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇచ్చుకున్నారు. భారతదేశం తన జీవితంలో కీలక భాగమని, తన సంగీత తనను తాను వ్యక్తపరుచుకునేందుకు ఉద్దేశించినదని, ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం తనకు లేదన్నారు. ఒక టీచర్‌గా, ఇక ఇల్లులా ఇండియా తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఒక స్టేజీపై 'వందేమాతరం' పాడటం ద్వారా విమర్శల ప్రశంసలను సైతం అందుకుంటున్నారు.
ఈనెల 23వ తేదీన యూఏఈలోని ఇతిహాద్ ఎరీనాలో ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ జరిగింది. ఇందులో ఆయన తన పాపులర్ సాంగ్స్‌తో పాటు 'వందేమాతరం' ఆలపించి జనాన్ని ఉర్రూతలూగించారు. కాన్సర్ట్‌కు హాజరైన ఆడియెన్స్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ప్రస్తుతం వైరల్ అవుతోంది.
శేఖర్ కపూర్ ప్రశంసలు
ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ అద్భుతంగా ఉందంటూ ఆ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నటుడు, నిర్మాత శేఖర్ కపూర్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రశంసలు కురిపించారు. ప్రేక్షకులతో కాన్సర్ట్ కిక్కిరిసిపోయిందని, రెహమాన్ పాటలకు 20,000 వేల మందికి పైగా జనం కేరింతలు కొడుతూ, పాడుతూ, డాన్యులు చేస్తూ, చివరకు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. రెహమాన్ తన ఈవెంట్‌లో చివరిగా 'వందేమాతరం' ఆలపించేసరికి ఎరీనా దద్దరిల్లిపోయింది.
ఇవి కూడా చదవండి..
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. 27న అఖిలపక్షం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. ఎంపీ ఇంజినీర్ రషీద్‌కు కస్టడీ పెరోల్
Read Latest National News