Home » New Delhi
ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో శుక్రవారంనాడు అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. పలువురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి వీరంగం చేశారు.
భారత్-ఫ్రాన్స్ మధ్య పెరుగుతున్న మైత్రీబంధాన్ని గుర్తుగా ప్రధాని నరేంద్ర మోదీతో తాను కలిసి ఉన్న ఏఐ-ఫోటోను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ బుధవారంనాడు షేర్ చేశారు.
ఉచితంగా హోటల్ గది ఇవ్వలేదని ఓ విదేశీయుడు తన గొంతును కోసుకున్నాడు. న్యూఢిల్లీలో బుధవారం ఈ ఘటన జరిగింది. గాయాలపాలైన అతడిని ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎంత నష్టం జరిగిందో.. అంచనా కోసం కమిటీకి బాధ్యతలు అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కమిటీ నివేదిక అందిన తర్వాతే కాళేశ్వరంపై ఆలోచిస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన ఎలాంటి చర్చ జరగలేదని ఏఐసీసీ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.
రోడ్డుపై కుప్పకూలిపోయి చావుబతుకుల మధ్య పోరాడుతున్న వ్యక్తి నుంచి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చోరీ చేసుకుని వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీలో రేపు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారని, ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే కూటమి సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం.
ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ఆశలు, అంచనాలు భారీగానే ఉన్నాయి. గతేడాది బడ్జెట్‌లో కొత్త పన్ను విధానం కింద రూ.12లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపునిచ్చారు. మరి ఈ ఏడాది బడ్జెట్లో ఎంతమేరకు మినహాయింపులు ఉంటాయన్నది చర్చనీయాంశమైంది.
ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో సమర్పిస్తారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఆదివారం రోజున బడ్జెట్ సమర్పణ జరుగుతుండటం గమనార్హం.
దేశానికి భద్రత కల్పించే ఒక మహిళా కమాండో, అదీ.. గర్భిణీ. తన ఇంట్లోనే రక్షణ లేక ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌లో కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి, తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు.