Home » Nellore
సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-తిరుచానూరు (తిరుపతి) మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
నాయుడుపేట స్వర్ణముఖినది వంతెనపై మరమ్మతులతో పలు మెము రైళ్లు రద్దు కాగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొంత ఆలస్యంగా నడిచాయి.
చదువుతో పేదరికాన్ని జయించవచ్చని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. తాను ట్యూషన్స్ ప్రారంభించి కష్టపడి ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా కావలి మండలం తాగేటివారిపాలెంలో టీడీపీ కార్యకర్త చాట్ల వాసు హత్య రాజకీయంగా కలకలం రేపింది. ఇటీవల జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రశేఖర్ ఏం చెబితే అదే కాకాణి మాట్లాడుతున్నారన్నారు.
జోసఫ్ రావణ్ వంటి వ్యక్తిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమర్థించడం దుర్మార్గమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఈ వ్యవహారంపై జగన్ స్పందించి.. భారతీయులు, అన్ని మతాల ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు అడ్డుపడితే ప్రజలు సహించరని.. మంచిని చెడుగా చూపిస్తే, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 62 ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 6200 ఆలయాల్లో ధూప, దీప నైవేద్యం కింద నెలకు రూ.10 వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు.
పేదలను ఆనందంగా చూడాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. పెన్షన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు.