Priest locks Temple: దళితులు గుడిలోకి రావద్దని గుడికి తాళం వేసిన పూజారి

ABN, Publish Date - Oct 06 , 2025 | 04:54 PM

నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. దళితులు ఆలయంలోకి ప్రవేశించకూడదని చెప్పి, ఒక పూజారి ఆలయానికి తాళం వేసిన ఘటనపై గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

నెల్లూరి జిల్లా: పాలింపాడులో అమ్మవారి గుడికి వెళ్లిన దళితులను పూజారి అవమానించిన ఘటన చోటుచేసుకుంది. నైవేద్యం సమర్పిస్తుండగా గుడిలోపలకు రావొద్దంటూ పూజారి తాళం వేయడంతో దళితులు ఆందోళన చేపట్టారు. పూజారి వైఖరిపై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది

Updated at - Oct 06 , 2025 | 04:54 PM