Fake CI : నెల్లూరులో నకిలీ సీఐ.. దొరికినంత దోచేశాడు
ABN , Publish Date - Sep 26 , 2025 | 07:37 PM
నెల్లూరులో నకిలీ పోలీస్ అరెస్ట్ అయ్యాడు. క్రైమ్ బ్రాంచ్ CI నంటూ చెలామణీ అవుతూ ఇంతకాలం పబ్బం గడుపుకున్న నకిలీ కేటుగాడిని వేదాయపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు.
నెల్లూరు, సెప్టెంబర్ 26: నెల్లూరులో నకిలీ పోలీస్ అరెస్ట్ అయ్యాడు. క్రైమ్ బ్రాంచ్ సీఐనంటూ చెలామణీ అవుతూ ఇంతకాలం పబ్బం గడుపుకున్న నకిలీ కేటుగాడిని వేదాయపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సీఐ పోలీసు యూనిఫామ్ ధరించి చాలా మందికి టోకరా వేసిన కేటుగాడి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా మంది నిరుద్యోగుల నుంచి ఈ కేటుగాడు పెద్ద మొత్తంలో నగదు దోచుకున్నట్టు తెలిసింది.
ఇలా రూ.51 లక్షలు ఆన్లైన్ లావాదేవీలు, నగదు రూపంలో వసూలు చేసినట్టు తెలుస్తోంది. నకిలీ సీఐపై ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. దీంతో నకిలీ సీఐని వేదయపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
Read latest AP News And Telugu News