Super Six Schemes: సూపర్ సిక్స్ పథకాలు.. సూపర్ సక్సెస్: సోమిరెడ్డి
ABN , Publish Date - Oct 04 , 2025 | 03:37 PM
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ సక్సెస్ చేసిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. ఆటో డ్రైవర్ల కొరకు ప్రత్యేకంగా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు.
నెల్లూరు, అక్టోబర్ 4: జిల్లాలోని ముత్తుకూరు మండలం ఏపీ జెన్కో రోడ్డు సెంటర్ నుంచి ముత్తుకూరు వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (MLA Somireddy Chandramohan Reddy) పాల్గొన్నారు. ఆపై ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్లకు చెక్కును అందజేశారు ఎమ్మెల్యే. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ సక్సెస్ చేసిందని అన్నారు. ఆటో డ్రైవర్ల కొరకు ప్రత్యేకంగా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 2,651 లబ్ధిదారులకు 3.97 కోట్లు అందించడం జరిగిందన్నారు.
వైసీపీ హయాంతో పోలిస్తే పెరిగిన లబ్ధిదారులు జిల్లాలో 18902 మందికి రూ.28.35 కోట్ల లబ్ధి చేకూరిందని వెల్లడించారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో కొంత ఆదాయం కోల్పోయిన ఆటోడ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. వైసీపీ పాలనలో కేవలం రూ.10 వేలు చొప్పున 16596 మందికి వాహనమిత్ర పథకం అమలు చేశారన్నారు. అప్పట్లో కేవలం రూ.16.51 కోట్లు అందించగా, ఇప్పుడు రూ.28.35 కోట్లు అందించడం జరిగిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు జిల్లాలోని ఎస్‌బీఎస్ కళ్యాణమండపంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించారు. జిల్లాలో 17,406 మంది ఆటోలు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రూ.26.10 కోట్లు పంపిణీ జరిగిందని మంత్రి ఆనం వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
యాగి చేయాలనేదే జగన్ ఆలోచన.. మంత్రి ఫైర్
సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధం.. వైసీపీకి మంత్రి సవాల్
Read Latest AP News And Telugu News