Share News

Janardhan Reddy AP Welfare Schemes: సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధం.. వైసీపీకి మంత్రి సవాల్

ABN , Publish Date - Oct 04 , 2025 | 03:10 PM

సంక్షేమ పథకాలకు సంబంధించి వైసీపీ నేతలతో చర్చకు ఎక్కడైనా సిద్ధమే మంత్రి సవాల్ చేశారు. గత 5 ఏళ్లలో రాజధాని లేని రాష్ట్రంగా వైసీపీ చేస్తే.. నేడు అమరావతిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు.

Janardhan Reddy AP Welfare Schemes: సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధం.. వైసీపీకి మంత్రి సవాల్
Janardhan Reddy On AP Welfare Schemes

నంద్యాల, అక్టోబర్ 4: బనగానపల్లెలో ఆటోడ్రైవర్ల సేవలో కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దక్షిణా కొరియా పర్యటనకు వెళ్లానని తెలిపారు. దక్షిణ కొరియాలో ప్రముఖ కంపెనీలైన ఎల్జీ, కియా వంటి అనేక కంపెనీలను సందర్శించామన్నారు. పోలవరాన్ని పట్టాలెక్కించి, 2028 ఆగష్టు నాటికి నీళ్లివ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.


సంక్షేమ పథకాలకు సంబంధించి వైసీపీ నేతలతో చర్చకు ఎక్కడైనా సిద్ధమే సవాల్ చేశారు. గత 5 ఏళ్లలో రాజధాని లేని రాష్ట్రంగా వైసీపీ చేస్తే.. నేడు అమరావతిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు మంత్రి. యావత్ దేశం అమరావతి అభివృద్ధి వైపు చూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం – అభివృద్ధి సమపాళ్లలో ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో అధ్వాన్న, గుంతల రోడ్లతో ఆటోలు, ఇతర వాహనాలు దారుణంగా దెబ్బతిని వాటి రిపేర్ల వ్యయం తడిసిమోపెడు అయ్యేదని విమర్శించారు. రాష్ట్రంలో రూ. 4,500 కోట్లతో రహదారుల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నా యని తెలిపారు. బనగానపల్లెలో వీధివీధికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు వేస్తున్నామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

మహిళలను కించపర్చొద్దు... ఏదైనా ఆడవారి తర్వాతే..

యాగి చేయాలనేదే జగన్ ఆలోచన.. మంత్రి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 04 , 2025 | 03:11 PM