Share News

Lakshmi Naidu Case: లక్ష్మీనాయుడు హత్య కేసుపై హోంమంత్రికి సీఎం కీలక ఆదేశం

ABN , Publish Date - Oct 19 , 2025 | 04:57 PM

నెల్లూరు జిల్లా దారకానిపాడు మంత్రులు పి.నారాయణ, వంగలపూడి అనిత వెళ్లారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రులు నెల్లూరులో పర్యటించారు.

Lakshmi Naidu Case: లక్ష్మీనాయుడు హత్య కేసుపై హోంమంత్రికి సీఎం కీలక ఆదేశం
Chandrababu Naidu

నెల్లూరు జిల్లా: దారకానిపాడుకు చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసు ఘటనపై హోంమంత్రి అనితను నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కోరారు. కూటమి నేతలతో దారకానిపాడు వెళ్లి ఘటనపై సమీక్షించాలని మంత్రులను సీఎం ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు పి.నారాయణ, వంగలపూడి అనిత దారకానిపాడుకు ఇవాళ(ఆదివారం) వెళ్లారు. అక్టోబర్ 2, దసరా పండుగ నాడు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు(Lakshmi Naidu Case)ని కారుతో ఢీకొట్టి హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఈ హత్య కేసు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ తరలించారు.


ఈ ఘటనపై రాజకీయ దుమారం లేవడంతో సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం(CM Chandrababu Naidu) నిర్ణయించింది. కూటమికి చెందిన మూడు పార్టీల నేతలను బాధిత కుటుంబం దగ్గరకు వెళ్ళాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆయన ఆదేశాలతో మంత్రులు నారాయణ, అనిత నెల్లూరులో పర్యటిస్తున్నారు. హత్యకు కారణాలు, పోలీస్ విచారణ, తీసుకున్న చర్యలు, బాధిత కుటుంబానికి సాయంపై సమగ్ర నివేదిక మంత్రులు, నేతలు సీఎం చంద్రబాబు(Chandrababu orders)కు ఇవ్వనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 19 , 2025 | 07:30 PM