Home » NEET Exam
నీట్ పేపర్ లీక్ వ్యవహారం తర్వాత చేపట్టిన సంస్కరణల పురోగతిపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. శాశ్వత వ్యవస్థాగత సంస్కరణలు ఎలా అమలు చేస్తున్నారో వివరిస్తూ సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. విద్యా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, విద్యార్థుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసనల నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లను మూసివేయడంపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ మద్దతు ప్రకటించారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పందించారు.
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీలపై కొనసాగుతున్న సీజేపీ ఆధ్వర్యంలోని విద్యార్థి ఉద్యమం ముంబైలోనూ ఉద్ధృతమవుతోంది. నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులను అడ్డుకునేందుకు ముంబై పోలీసులు కొత్త వ్యూహాలు అవలంబిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలతో పాటు విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు'.. అంటూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.
పరీక్షల అక్రమాలకు పాల్పడి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఉపేక్షించబోమని ప్రధాని మోదీ చెప్పారు. పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారికి త్వరితగతిన, శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు.
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు బుధవారం లేఖ రాశారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు పెట్టొద్దని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.