విద్యార్థులపై కేసులు పెట్టొద్దు.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
ABN , Publish Date - Jul 22 , 2026 | 06:22 PM
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు బుధవారం లేఖ రాశారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు పెట్టొద్దని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ, జులై 22: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు బుధవారం లేఖ రాశారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు పెట్టొద్దని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. విద్యార్థులపై కేసులు పెట్టబోమని కేంద్రం హామీ ఇవ్వాలని కోరారు. కేంద్రం హామీ ఇస్తే దీక్ష విరమిస్తానని స్పష్టం చేశారు. కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే తన దీక్ష కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
ఆస్పత్రిలో కొనసాగుతున్న దీక్ష..
విద్యా వ్యవస్థలో వైఫల్యాలపై సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28వ తేదీనుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించటంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు కొద్దిరోజుల క్రితం జంతర్ మంతర్ వద్ద నుంచి ఆయననను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. మొదట సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం వాంగ్‌చుక్‌ను గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి మార్చారు. ఆయన అక్కడి ఐసీయూలో ఉంటూనే.. డాక్టర్ల బలవంతపు ఫీడింగ్‌ను నిరాకరిస్తూ దీక్షను కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఆధారాలు లేకుండా నాపై నేరం మోపారు: నటి కాదంబరి జెత్వాని లేఖ
పశుగ్రాస కొరతను నివారించేందుకు ప్రత్యేక చర్యలు: ఏపీ పశుసంవర్ధక శాఖ