Share News

పశుగ్రాస కొరతను నివారించేందుకు ప్రత్యేక చర్యలు: ఏపీ పశుసంవర్ధక శాఖ

ABN , Publish Date - Jul 22 , 2026 | 05:55 PM

ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా పశుగ్రాస కొరతను నివారించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా.టి.దామోదర నాయుడు వెల్లడించారు. ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

పశుగ్రాస కొరతను నివారించేందుకు ప్రత్యేక చర్యలు: ఏపీ పశుసంవర్ధక శాఖ
AP Animal Husbandry Dept

అమరావతి, జులై 22: ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా పశుగ్రాస కొరతను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా.టి.దామోదర నాయుడు వెల్లడించారు. ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే నవంబర్ నాటికి తీవ్ర పశుగ్రాస కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వివరించారు. పశు సంపదను కాపాడుకోవడానికి పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని పేర్కొన్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా సాగు చేసిన పశుగ్రాసాల వినియోగంపై పశు పోషకులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. మండల డివిజన్, జిల్లా స్థాయిలలో పశుగ్రాస పర్యవేక్షణ కమిటీలను నియమిస్తున్నట్లు వివరించారు.


ప్రతి పశు వైద్యశాల పరిధిలో ఓ ‘పశుగ్రాస అభివృద్ధి కమిటీ’ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పశుగ్రాస విత్తనాల వినియోగం, నీటి వనరుల లభ్యత, మాగుడు గడ్డీ.. తయారీ వంటి అంశాలపై ఈ కమిటీ దృష్టి సారిస్తుందని వివరించారు. జిల్లా స్థాయిలో మాగుడుగడ్డి (సైలేజి), సంపూర్ణ మిశ్రమ దాణా తయారీ, సరఫరాకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు. పశువుల సంతలపై నిరంతర నిఘా ఉంచుతున్నట్లు చెప్పారు. రైతుల కొరతను చూసి తక్కువ ధరలకు పశువులను అమ్మకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీటి వినియోగదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాల సహకారంతో కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.


రైతు ఉత్పత్తిదారుల సంఘాల సహకారంతో పాటు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పీ 4 విధానంలో నిధులను సేకరించి పశుగ్రాస అభివృద్ధికి చర్యలు చేపడతామని అన్నారు. పశు వైద్య కళాశాలలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాలలో భవిష్యత్ అవసరాల కోసం పశుగ్రాస నిల్వ కేంద్రాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఘనంగా గాడిదలకు పెళ్లి ?.. వీడియో వైరల్

లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడిన యువకుడు.. అంతలో తల్లి నుంచి ఫోన్.. వీడియో వైరల్

For More AP News And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 06:09 PM