Home » National News
గ్రౌండ్ హ్యాండిలర్స్‌కు చెందిన బస్సు మధ్యాహ్నం సమయంలో మంటల్లో చిక్కుకుందని, అయితే ఏఆర్‌ఎఫ్ఎఫ్ నిపుణుల బృందం రెండు నిమిషాల్లోనే మంటలను అదుపు చేసిందని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారిక 'ఎక్స్' ఖాతాలో తెలియజేసింది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
వివిధ నియోజకవర్గాల్లో పలువురు నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండటం, పార్టీ నామినీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు వస్తున్న వార్తలతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్టు ఆర్జేడీ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా షాహిన్‌బాగ్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించిన బిల్కిస్ బానో, రైతు ఉద్యమంలో పాల్గొంటున్న 73 ఏళ్ల మహిందర్ కౌర్ ఒకటేనంటూ అప్పట్లో కంగన ట్వీట్ చేసారు.
ఇటీవల తాను వచ్చినప్పుడు ఇక్కడి గ్రామం పేరు ముస్తఫాబాద్ అని తనకు చెప్పారని, ఎంతమంది ముస్లింలు నివసిస్తున్నారని తాను అడిగినప్పుడు ఒక్కరు కూడా లేరని తనకు చెప్పారని యోగి వివరించారు.
ఎన్నికల జాబితా క్వాలిటీపై ప్రతి ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు లెవనెత్తుతున్నందున ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టడం అవసరమైందని సీఈసీ చెప్పారు. 1951 నుంచి 2004 వరకూ 8 సార్లు ఎస్ఐఆర్ నిర్వహించామని, చివరిసారిగా 21 ఏళ్ల క్రితం 2002-2004 మధ్య చేపట్టామని చెప్పారు.
కోర్టు ధిక్కార నోటీసు జారీ చేయడం వల్ల సీజేఐపై షూ విసిరిన లాయర్‌కు అనవసర ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని, ఈ ఘటన దానంతటదే సద్దుమణుగుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయ పడింది.
హర్యానాలోని హిస్సార్‌లో 1962 ఫిబ్రవరి 10 జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. 370వ అధికరణ రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం తదితర కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో ఆయన ఉన్నారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో సాధ్యమైనంత త్వరగా ఎస్ఐఆర్‌ను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరిలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున తొలి విడత ఎస్ఐఆర్‌లో ఆ రాష్ట్రాలు చోటుచేసుకోనున్నాయి.
లొంగిపోయిన మావోయిస్టులు 18 ఆయుధాలను కూడా పోలీసులకు స్వాధీనం చేసినట్టు బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పి.సుందర రాజ్ తెలిపారు. వీరంతా కుమారి/కిస్కోడో ప్రాంత కమిటీ కేష్కల్ డివిజన్ (నార్త్ సబ్ జోనల్ బ్యూరో)కు చెందిన వారని చెప్పారు.