Share News

యాసిడ్ దాడి కేసుల్లో నిందితుల ఆస్తులు ఎందుకు వేలం వేయకూడదు.. ప్రశ్నించిన సుప్రీం

ABN , Publish Date - Jan 27 , 2026 | 09:16 PM

2009లో యాసిడ్ దాడి బాధితురాలు, బ్రేవ్ సోల్స్ ఫౌండేషన్ (ఎన్జీఓ) వ్యవస్థాపకురాలు షాహీన్ మాలిక్ వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు విచారణ జరిపింది.

యాసిడ్ దాడి కేసుల్లో నిందితుల ఆస్తులు ఎందుకు వేలం వేయకూడదు..  ప్రశ్నించిన సుప్రీం
Supreme Court

న్యూఢిల్లీ: యాసిడ్ దాడుల కేసుల్లో బాధితులకు జీవితాంతం చికిత్స, పునరావాసం కోసం ప్రస్తుతం ఇస్తున్న రూ.3లక్షల పరిహారం సరిపోదని, మరింత మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. యాసిడ్ దాడుల కేసుల్లో నిందితుల ఆస్తులను వేలం వేసి బాధితులకు పరిహారంగా ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించింది. ఇలాంటి దారుణమైన నేరాలను నివారించేందుకు ఆసాధారణ శిక్షలు ఉండాలని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. 2009లో యాసిడ్ దాడి బాధితురాలు, బ్రేవ్ సోల్స్ ఫౌండేషన్ (ఎన్జీఓ) వ్యవస్థాపకురాలు షాహీన్ మాలిక్ వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు విచారణ జరిపింది.


ఈ కేసు విషయంలో తాను 16 ఏళ్లుగా పోరాడుతున్నానని, అయితే ట్రయిల్ కోర్టులో నిందితులందరూ విడుదల అయ్యారని షాహీన్ మాలిక్ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. యాసిడ్ దాడి జరిగినప్పుడు తన వయస్సు 26 ఏళ్లని, ఇప్పుడు 42 ఏళ్లని చెప్పారు. తన జీవితంలో విలువైన కాలాన్ని ఈ కేసు కోసం జరిపిన పోరాటంలోనే కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ తాను ఎక్కడున్నానో అర్ధం కావడం లేదన్నారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ, బాధితురాలి తరఫున హైకోర్టు నుంచి మంచి లాయర్‌తో కేసు వాదించేలా సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.


కోర్టు కీలక ఆదేశాలు

యాసిడ్ దాడులకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడాది వారీగా జరిగిన యాసిడ్ దాడులు, చార్జిషీటులు ఎన్ని దాఖలయ్యాయి, కోర్టుల్లో కేసులో ఏ దశలో ఉన్నాయి, బాధితుల కోసం చేపట్టిన పునరావాస చర్యలపై నాలుగు వారాల్లోగా వివరాలు అందించాలని ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రివర్స్‌గేర్ వేయలేం... వీబీ-జీ రామ్ జీ చట్టంపై కిరణ్ రిజిజు

నేనూ భారతీయ పౌరుడినే.. ఓసీఐ కార్డును ప్రదర్శించిన ఆంటోనియో కోస్టా

For More National News And Telugu News

Updated Date - Jan 27 , 2026 | 09:23 PM