రాహుల్‌గాంధీతో షర్మిల భేటీ
ABN , Publish Date - Jan 28 , 2026 | 07:22 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ, జనవరి 27(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచే ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని రాహుల్‌ను కోరారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి ఫిబ్రవరి 2వ తేదీతో 20 ఏళ్లు పూర్తవుతుందన్నారు. అందుకే ఏపీ నుంచే ఉపాధి హామీ పునరుద్ధరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని రాహుల్ గాంధీని కోరానని పేర్కొన్నారు. ఆయన తప్పనిసరిగా వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.