Home » National Award
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజు జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖీ పోరు నెలకొంది.
ఆధార్‌ను విలువైన ఐడెంటిటీ ప్రూఫ్‌గా పరిగణించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే. ఆధార్ ప్రామాణికత, వాస్తవికతను పరీక్షించే అధికారం అధికారులకే అప్పగిస్తున్నామని తెలిపింది.
నిందితుడు అశ్వనీ కుమార్ వృత్తిరీత్యా జ్యోతిష్యుడు. పాట్నాలోని పాటలిపుత్రలో వాస్తు కన్సల్టెంట్‌గా ఉన్నాడు. గత ఐదేళ్లుగా నొయిడా సెక్టార్ 79లో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అతని తండ్రి సురేష్ కుమార్ పదవీవిరమణ చేసిన విద్యాశాఖ అధికారి.
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో నక్సల్స్‌తో పోరాడిన సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, డీఆర్‌జీ, కోబ్రా జవాన్లను వారి కుటుంబ సభ్యులతో సహా కలుసుకుని సన్మానించడం జరిగిందని అమిత్‌షా తెలిపారు.
2024 డిసెంబర్ 31 లోపు వివిధ కారణాలతో భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ శరణార్ధుల వద్ద పాస్‌పోర్ట్, ఇతర పత్రాలు లేకున్నా భారత్‌లో ఉండేదుకు అనుమతిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది.
ఆఫ్ఘన్‌లో ఆదివారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ పెను భూకంపం ధాటికి 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2,500 మందికి పైగా గాయపడ్డారు. అనేక గ్రామాలు దెబ్బతిన్నాయి.
ఆందోళనకారులు పెద్దసంఖ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్‌కు చేరుకోవడంతో ఆ ప్రాంతంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచిస్తున్నట్టు ముంబై ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
పార్లమెంటులో ప్రతిపాదిత బిల్లును మోదీ సమర్ధిస్తూ, నేరచరిత్ర ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటుందని, జైలు నుంచి ఆదేశాలు ఇవ్వడం కుదరదని అన్నారు.
ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఈనెల 20న రాధాకృష్ణన్ నామినేషన్ వేసే అవకాశం ఉంది. మంగళవారంనాడు జరిగే ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయనను సన్మానించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
ప్రభుత్వ పథకాల్లో సీఎం ఫోటోలను ఉపయోగించే విధాన్ని దేశమంతా అనుసరిస్తోందని, పిటిషనర్‌కు నిజంగానే అంత ఆందోళన ఉంటే ఒక పార్టీనే ఉద్దేశించి కాకుండా అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నేతలతో ఉన్న పథకాలను ఎందుకు సవాలు చేయలేదని సుప్రీంకోర్టు నిలదీసింది.