Share News

CAA Cut off Date Extended: పౌరసత్వ నిబంధనల సడలింపు.. పాక్, బంగ్లా, అఫ్ఘాన్ శరణార్థులకు ఊరట

ABN , Publish Date - Sep 03 , 2025 | 02:51 PM

2024 డిసెంబర్ 31 లోపు వివిధ కారణాలతో భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ శరణార్ధుల వద్ద పాస్‌పోర్ట్, ఇతర పత్రాలు లేకున్నా భారత్‌లో ఉండేదుకు అనుమతిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది.

CAA Cut off Date Extended: పౌరసత్వ నిబంధనల సడలింపు.. పాక్, బంగ్లా, అఫ్ఘాన్ శరణార్థులకు ఊరట
CAA

న్యూఢిల్లీ: పౌరసత్వ నిబంధనలను సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మైనారిటీలకు ఊరట కల్పించింది. 2024 డిసెంబర్ 31 లోపు వివిధ కారణాలతో భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ శరణార్ధుల వద్ద పాస్‌పోర్ట్, ఇతర పత్రాలు లేకున్నా భారత్‌లో ఉండేదుకు అనుమతిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. అయితే గత ఏడాది అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) ప్రకారం 2014, డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే భారత పౌరసత్వం కల్పించనున్నట్టు వెల్లడించింది.


ఇమిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ యాక్ట్-2025 కింద ఈ తాజా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోం శాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పాకిస్థాన్‌లో మతపరమైన హింస కారణంగా భయంతో 2024 డిసెంబర్ 31వ తేదీలోపు భారత్‌ను ఆశ్రయించిన ముస్లిమేతర శరణార్ధులకు ఎంతో ఊరట కలుగుతుంది. వీరు చెల్లుబాటయ్యే పత్రాలు లేకపోయినా భారత్‌లో నివసించవచ్చు.


ఇవి కూడా చదవండి..

ఇళ్లపై విరిగిపడ్డ కొండ చరియలు.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య..

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ 'లక్కీ భాస్కర్' అరెస్ట్

For More National News And Telugu News

Updated Date - Sep 03 , 2025 | 02:56 PM