Supreme Court On Bihar SIR: ఆధార్‌ను అంగీకరించాల్సిందే.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశం
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:51 PM
ఆధార్‌ను విలువైన ఐడెంటిటీ ప్రూఫ్‌గా పరిగణించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే. ఆధార్ ప్రామాణికత, వాస్తవికతను పరీక్షించే అధికారం అధికారులకే అప్పగిస్తున్నామని తెలిపింది.
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల కమిషన్ కొనసాగిస్తున్న ఎస్ఐఆర్ (SIR) డ్రైవ్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల జాబితాలో ఓటరుగా నమోదుకావడానికి 12వ నిర్దేశిత డాక్యుమెంట్‌గా ఆధార్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆధార్‌ను గుర్తించేందుకు ఈసీ అధికారులు నిరాకరిస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంపై అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలిచ్చింది.
ఆధార్‌ను విలువైన ఐడెంటిటీ ప్రూఫ్‌గా పరిగణించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఆధార్ ప్రామాణికత, వాస్తవికతను పరీక్షించే అధికారం అధికారులకే అప్పగిస్తున్నామని తెలిపింది. ఫీల్డ్ ఆఫీసర్లకు ఈ మేరకు వెంటనే ఆదేశాలివ్వాలని న్యాయమూర్తులు సూర్య కాంత్, జోయ్‌మాల్యా బాగ్జితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. పౌరసత్వం, వయస్సు నిర్ధారణ వంటి విషయాలలో ఆధార్‌ను కచ్చితమైన లేదా ఏకైక ఆధారంగా పరిగణించలేమని కూడా ధర్మాసనం పేర్కొంది.
బిహార్ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆర్జేడీ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ తన వాదనలు వినిపించారు. ఆధార్‌ను ఉద్దేశపూర్వకంగానే ఈసీఐ మినహాయిస్తోందన్నారు. 11 నోటిఫైడ్ డాక్యమెంట్లను మినహా వేటినీ రిజస్ట్రేషన్ ఆఫీసర్లు అంగీకరించడం లేదని చెప్పారు. ఆధార్ వంటి యూనివర్శల్ డాక్యుమెంట్‌ను నిరాకరిస్తే ఇంక్ల్యూజివ్ ఎక్సర్‌సైజ్ అనే మాటకు అర్ధం ఏముంటుందని ప్రశ్నించారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ, కేవలం 'ఆధార్' ఆధారంగానే ఓటర్ స్టాటస్‌ను నిర్ధారించాలని పిటిషన్ల అభిప్రాయమా అని ప్రశ్నించారు. దీనికి సిబల్ సమాధానమిస్తూ, తాను 2025 ఎన్నికల జాబితాలో ఉన్నానని, ఇంక ప్రూవ్ చేసుకోవడం అనే ప్రశ్న ఎలా తలెత్తుందని అన్నారు. బీఎల్ఓలు తన పౌరసత్వాన్ని నిర్ధారించలేరని పేర్కొన్నారు.
కోర్టులో కమిషన్ చెబుతున్న దానికి, గ్రౌండ్ లెవెల్లో అధికారులకు ఇస్తున్న ఆదేశాలకు మధ్య గ్యాప్ కనిపిస్తోందని బెంచ్ అభిప్రాయపడింది. తాము ఆదేశాలిచ్చినప్పటికీ ఆధార్ అక్కరలేకుండా 11 డాక్యుమెంట్లనే ఎందుకు కాపీలో ప్రస్తావిస్తున్నారని నిలదీసింది. దానికి ఈసీఐ తరఫు న్యాయవాది రాకేష్ ద్వివేదీ సమాధానమిస్తూ, ఎక్కడైనా పొరపాటు జరిగిందేమో చూస్తానని, ఆధార్ అంగీకరించాలనే కోర్టు ఇచ్చిన గత ఆదేశాలను కమిషన్ పబ్లిష్ చేసిందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
అవమానాలను అంత తేలిగ్గా మరిచిపోలేం.. ట్రంప్ కొత్త స్వరంపై శశిథరూర్
For More National News And Telugu News