Share News

PM Modi on Afganistan Earthquake: అప్ఘనిస్తాన్‌ను ఆదుకుంటాం.. మోదీ అభయం

ABN , Publish Date - Sep 01 , 2025 | 05:30 PM

ఆఫ్ఘన్‌లో ఆదివారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ పెను భూకంపం ధాటికి 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2,500 మందికి పైగా గాయపడ్డారు. అనేక గ్రామాలు దెబ్బతిన్నాయి.

PM Modi on Afganistan Earthquake: అప్ఘనిస్తాన్‌ను ఆదుకుంటాం.. మోదీ అభయం

న్యూఢిల్లీ: అఫ్ఘనిస్తాన్‌ (Afganistan)లో సంభవించిన భారీ భూకంపం (Earthquake)లో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భూకంపం దాటికి నష్టపోయిన అఫ్ఘాన్‌కు అన్నిరకాల మానవతా సాయాన్ని అందిస్తామని, అందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. చైనా పర్యటనలో ఉన్న మోదీ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు.


'అఫ్ఘాన్‌ భూకంపంలో జరిగిన ప్రాణనష్టం తీవ్ర విచారం కలిగిస్తోంది. ఈ విపత్తులో కుటుంబసభ్యులు, సన్నిహితులను కోల్పోయిన వారికి తగిన శక్తినివ్వాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. బాధితులను ఆదుకునేందుకు అన్నిరకాల మానవతా సాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది' అని మోదీ ట్వీట్ చేశారు.


అఫ్ఘాన్‌లో ఆదివారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ పెను భూకంపం ధాటికి 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2,500 మందికి పైగా గాయపడ్డారు. అనేక గ్రామాలు దెబ్బతిన్నాయి. ఈ క్లిష్ట సమయంలో అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు ఆదుకోవాలని తాలిబన్ ప్రభుత్వం కోరింది.


ఆహార సామగ్రి సరఫరా

కాగా, అఫ్ఘాన్‌ భూకంపంలో పెద్దఎత్తున ప్రాణనష్టం జరగడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ ఆదేశ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖికి సంతాపం తెలియజేశారు. భారత్ అన్నివిధాలా ఆదుకుంటుందని చెప్పారు. టెంట్లు, ఆహార సరఫారాలు, ఇతర సహాయక సామాగ్రిని అఫ్ఘాన్‌కు పంపుతున్నట్టు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

ఈసీపై త్వరలో పెద్ద బాంబు పేలుస్తా..

షరతులు అతిక్రమిస్తున్నారు.. జారంగే దీక్షపై హైకోర్టు ఆగ్రహం

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 01 , 2025 | 05:38 PM