Share News

Amit Shah: యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో జవాన్ల సాహసాలను సువర్ణాక్షరాలతో లిఖించాలి

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:39 PM

ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో నక్సల్స్‌తో పోరాడిన సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, డీఆర్‌జీ, కోబ్రా జవాన్లను వారి కుటుంబ సభ్యులతో సహా కలుసుకుని సన్మానించడం జరిగిందని అమిత్‌షా తెలిపారు.

Amit Shah: యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో జవాన్ల సాహసాలను సువర్ణాక్షరాలతో లిఖించాలి
Amit Shah

న్యూఢిల్లీ: ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ (Operation Black Forest)లో భద్రతా బలగాల సాహసాలను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ప్రశంసించారు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా బలగాల సాహసాలను చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలని ప్రశంసించారు. హోం మంత్రి బుధవారంనాడు తన నివాసంలో సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, డీఆర్‌జీ, కోబ్రా బెటాలియన్లను, వారి కుటుంబ సభ్యులను సన్మానించారు.


అనంతరం అమిత్‌షా ఈ విషయాన్ని సోషల్ మీడియా 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో నక్సల్స్‌తో పోరాడిన సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, డీఆర్‌జీ, కోబ్రా జవాన్లను వారి కుటుంబ సభ్యులతో సహా కలుసుకుని సన్మానించినట్టు ఆ పోస్ట్‌లో అమిత్‌షా తెలిపారు.


యాంటి-నక్సల్ ఆపరేషన్లలో అతిపెద్దదైన కర్రెగుట్ట ఆపరేషన్ 19 రోజుల పాటు ఆగకుండా సాగిందని, సాహస జవాన్లు ఒక్కరుకూడా గాయకుండా 30 మందికి పైగా నక్సల్స్‌‌ను మట్టుబెట్టారని, నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లలో బలగాల సాహసాలను చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలని అన్నారు. నక్సలైట్లు లొంగిపోవడం కానీ, పట్టుబడటం కానీ, తుదముట్టించేంత వరకూ కానీ మోదీ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోరని, మోదీ నాయకత్వంలో నక్సల్స్ నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని చెప్పారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌ కారణంగా పశుపతినాథ్ నుంచి తిరుపతి ప్రాంతం వరకూ 6.5 కోట్ల మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. ఈ ఆపరేషన్లలో గాయపడిన భద్రతా బలగాల జీవితాలు సాఫీగా సాగేందుకు మోదీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 2026 మార్చి 31వ తేదీ నాటికి దేశానికి నక్సలిజం నుంచి విముక్తి కల్గిస్తామని అమిత్‌షా పేర్కొన్నారు. భద్రతా బలగాల సన్మానానికి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి..

పౌరసత్వ నిబంధనల సడలింపు.. పాక్, బంగ్లా, అఫ్ఘాన్ శరణార్థులకు ఊరట

సినిమాను మించిన ట్విస్ట్.. మిస్సింగ్ మిస్టరీ సాల్వ్..

For More National News And Telugu News

Updated Date - Sep 03 , 2025 | 03:42 PM