Home » Narendra Modi
ఏపీ పర్యటనపై ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతాలో గురువారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ఏపీలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
రష్యా చమురు కొనుగోలు చేయబోమని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. దీంతో, రష్యాను దారికి తెచ్చుకోవడం సులభమవుతుందని అన్నారు.
గాజాలో శాంతిని నెలకొల్పేందుకు ఈజిప్టు వేదికగా రేపు జరగనున్న శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలంటూ ప్రధాని మోదీని ఈజిప్టు అధ్యక్షుడు ఆహ్వానించారు. అయితే, భారత్ తరపున కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఆదివారం నాడు ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ఫినాలే జరగనున్న నేపథ్యంలో టోర్నీ బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్ సతీ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆయన మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా విలువిద్యకు మరింత ప్రోత్సాహం లభిస్తోందని అన్నారు.
భారత్‌పై ట్రంప్ విధించిన ఆంక్షలు రష్యాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని నాటో చీఫ్ మార్క్ రట్ అన్నారు. ఉక్రెయిన్‌పై ప్రణాళికల గురించి వివరించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారని తెలిపారు.
దాదాపు 150 దేశాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయి. 100 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. స్టార్టప్‌ల దగ్గరి నుంచి ఫార్ట్యూన్ 500 ఫామ్‌లు కూడా జోహో కస్టమర్లు కావటం విశేషం.
దేశం మునుపెన్నడూ చూడని ప్రజాకర్షక ప్రధానమంత్రి మోదీ అని, ఇటు స్వదేశంలోనూ, అంతర్జాతీయంగానూ అత్యంత జనాకర్షణ కలిగిన ప్రధానిగా పేరుతెచ్చుకున్నారని అమిత్‌షా పేర్కొన్నారు.
సోమవారం నుంచి జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం కానుందని ప్రధాని మోదీ తెలిపారు. జీఎస్టీ మార్పులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సమాన్య, మధ్య తరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది.