Pm Modi: ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం..
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:49 PM
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి మంగళవారం ఉదయం ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆమె మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ (Bangladesh)మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధినేత్రి బేగం ఖలీదా జియా (80)(Khaleda Zia) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో (Health Issue) బాధపడుతున్నారు. ఈ రోజు (మంగళవారం) తెల్లవారుజామున ఢాకాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సంతాపం (condolences)వ్యక్తం చేశారు. భారతదేశం - బంగ్లాదేశ్ సంబంధాలను బలోపేతం చేయడంతో ఆమె పాత్రను ప్రశంసించారు.
‘ఢాకాలో మాజీ ప్రధానమంత్రి, BNP చైర్ పర్సన్ ఖలీదా జియా మరణంచిన వార్త విని ఎంతో బాధపడ్డాను. ఆమె కుటుంబానికి, బంగ్లాదేశ్ ప్రజలందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం ఆమె కుటుంబానికి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా, ఆ దేశ అభివృద్ధికి భారత్- బంగ్లా సంబంధాలకు ఆమె చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2015 లో ఢాకాలో ఆమెతో ఒక సమావేశంలో పాల్గొన్నా. ఆమె గొప్ప దార్శనికురాలు, ఎప్పటికీ మాలాంటి వారికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటారని ఆశిస్తున్నాం’ అంటూ తన ‘X’ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ABN Effect: హాస్టల్ వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు
Magnus Carlsen: బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో అర్జున్ చేతిలో ఓడిన కార్ల్‌సన్.. ఆ కోపంతో...