World Blitz Chess Championship: కార్ల్‌సన్‌కు అర్జున్ షాక్
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:50 AM
ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన తెలుగు గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి.. బ్లిట్జ్ చాంపియన్‌షి్‌పలో టైటిల్ సాధించే దిశగా దూసుకెళుతున్నాడు. సోమవారం ప్రారంభమైన...
వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్‌షి్‌ప
దోహా: ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన తెలుగు గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి.. బ్లిట్జ్ చాంపియన్‌షి్‌పలో టైటిల్ సాధించే దిశగా దూసుకెళుతున్నాడు. సోమవారం ప్రారంభమైన బ్లిట్జ్ పోటీల్లో వరల్డ్ నెంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు అర్జున్ షాకిచ్చాడు. మొదటి రోజు 13 రౌండ్‌లు జరిగాయి. తొలిరోజు ముగిసేసరికి అర్జున్ (10) అగ్ర స్థానంలో నిలిచాడు. ఎనిమిది గేమ్‌లలో గెలిచిన అతడు నాలుగు మ్యాచ్‌లను డ్రా చేశాడు. ఒక గేమ్‌లో ఓడిన అర్జున్ మొత్తం 10 పాయింట్లు సాధించాడు. తొమ్మిదో రౌండ్‌లో కార్ల్‌సన్‌పై అర్జున్ గెలుపొందడం విశేషం. మరో ఇద్దరితో కలిసి అర్జున్ టాప్‌లో కొనసాగుతున్నాడు. మంగళవారం మరో ఆరు రౌండ్‌లతోపాటు సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. గుకేష్ (8.5) 28వ స్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల విభాగంలో మొదటి రోజు 10 రౌండ్‌లు జరిగాయి. ఎలిన్ రోబర్స్ (8.5), వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్ అలెక్సాండ్రా గొర్యాచ్కినా (8), ఒమనోవా (8) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక, ర్యాపిడ్‌లో కాంస్య పతకం సాధించిన గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి (5) సంయుక్తంగా 61వ స్థానంలో కొనసాగుతోంది.
ప్రధాని ప్రశంసలు
ఫిడే ప్రపంచ చాంపియన్‌షి్‌ప ర్యాపిడ్ విభాగంలో కాంస్య పతకాలు సాధించిన తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, అర్జున్ ఇరిగేసిలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆటపట్ల వీరికున్న పట్టుదల, పోరాటపటిమ ప్రశంసనీయమని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
రిటైర్‌మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
మూడో రౌండ్ నుంచి రో-కో ఔట్.. కారణం ఏంటంటే..?