PM Modi: గువాహటిలో అతిపెద్ద టెర్మినల్‌ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:16 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో భాగంగా గువాహటిలోని ‘లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ కొత్త ఇంటిగ్రెటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కొత్త టెర్మినల్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ఈ రోజు (శనివారం) గౌహతి(Guwahati)లోని ‘లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ (LGBIA) కొత్త ఇంటిగ్రెటెడ్ టెర్మినల్(Integrated terminal) భవనాన్ని ప్రారంభించారు. ఈ టెర్మినల్ ‘బాంబు ఆర్కి్డ్స్’(Bamboo Orchids) అనే కాన్సెప్ట్ తో రూపొందించారు. అంతేకాదు భారతదేశపు మొట్టమొదటి ప్రకృతి నేపథ్య విమానాశ్రయ(Airport) టెర్మినల్. ఇది ఏడాదికి 1.3 కోట్ల మంది (13.1 మిలియన్లు) ప్రయాణికులకు సేవలందిస్తుంది. ఇది ఈశాన్య భారతంలోనే అతి పెద్ద విమానాశ్రయంగా రూపొందింది. 1.4 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (శనివారం) గౌహతిలోని ‘లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ (LGBIA) కొత్త ఇంటిగ్రెటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ టెర్మినల్ ‘బాంబు ఆర్కి్డ్స్’(Bamboo Orchids) అనే కాన్సెప్ట్ తో రూపొందించారు. అంతేకాదు భారతదేశపు మొట్టమొదటి ప్రకృతి నేపథ్య విమానాశ్రయ టెర్మినల్. ఇది ఏడాదికి 1.3 కోట్ల మంది (13.1 మిలియన్లు) ప్రయాణికులకు సేవలందిస్తుంది. ఇది ఈశాన్య భారతంలోనే అతి పెద్ద విమానాశ్రయంగా రూపొందింది. చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
కాంగ్రెస్ నాయకుడు గోపీనాథ్ బార్డోలోయ్ కు అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం భారతరత్నను ప్రధానం చేసింది. లక్ష దేశీయ మొక్కలతో కూడిన ‘స్కై ఫారెస్ట్’ ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. డీజీయాత్ర సౌకర్యం, ఫుల్ - బాడీ స్కానర్లు, అత్యాధునిక సెక్యూరిటీ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ టెర్మినల్ ఆగ్రేయ ఆసియాకు గేట్ వేగా, ఈశాన్య భారత్ కి ఏవియేషన్ హబ్ గా ఉండలానే లక్ష్యంతో నిర్మించినట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి..
టీఎంసీ సంరక్షణలో చొరబాటుదారులు.... విరుచుకుపడిన మోదీ..
సంప్రదాయ వైద్య విధానాలపై విశ్వాసం అలా పెరుగుతుంది: ప్రధాని మోదీ