Share News

Pariksha Pe Charcha: గిన్నిస్ రికార్డు దిశగా.. 3 కోట్లు దాటిన రిజిస్ట్రేషన్లు

ABN , Publish Date - Jan 01 , 2026 | 09:05 AM

పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్రం పరీక్షాపే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ పాల్గొనే ఈ కార్యక్రమానికి ఈ ఏడాది రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య 3 కోట్లు దాటిపోయింది. త్వరలో మరో చారిత్రక రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.

Pariksha Pe Charcha: గిన్నిస్ రికార్డు దిశగా.. 3 కోట్లు దాటిన రిజిస్ట్రేషన్లు
Pariksha Pe Charcha 2026

ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థులకు మార్గనిర్దేశనం కోసం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రారంభమైన పరీక్షా పే చర్చా కార్యక్రమం మరో గిన్నిస్ రికార్డును నెలకొల్పే దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే 3 కోట్ల మందికి పైగా ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్నారు. జనవరి 11 వరకూ రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్న వారిలో 2.85 కోట్ల మంది విద్యార్థులు, 17 లక్షల మంది టీచర్లు, 3.49 లక్షల మంది తమ పేర్లను ఈ 8వ ఎడిషన్ కార్యక్రమం కోసం ఇప్పటివరకూ రిజిస్టర్ చేసుకున్నారు. డిసెంబర్ 30 నాటికి మూడు కోట్ల పైచిలుకు రిజిస్ట్రేషన్‌లతో ఈ కార్యక్రమం చారిత్రక మైలురాయిని చేరుకుందని కేంద్ర విద్యాశాఖ ఎక్స్ వేదికగా ప్రకటించింది. 2025 ఎడిషన్‌లో 3.53 కోట్ల మంది రిజిస్టర్ చేసుకుని గిన్నిస్ రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే (Pariksha Pe Charcha - Over 3 Cr registered).


2018లో ఈ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎంపికైన విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని నేరుగా ప్రధాని నుంచి మార్గనిర్దేశనం పొందొచ్చు. లక్ష్య సాధన, కలల సాకారం దిశగా నిలకడగా ఎలా ముందుకు సాగాలనే విషయంలో ప్రేరణ పొందొచ్చు. ఎగ్జామ్స్‌ను ఓ వేడుకలా ఎలా ఆస్వాదించాలి, స్వాతంత్ర్య సమరయోధుల సేవలు, పర్యావరణ పరిరక్షణ, క్లీన్ ఇండియా అంశాల నేపథ్యంలో తాజా ఎడిషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.

రిజిష్ట్రేషన్ ఇలా..

  • ముందుగా అభ్యర్థులు innovateindia1.mygov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

  • ప్రధాన పేజీలోని పార్టిసిపేట్ నౌ అనే అంశాన్ని ఎంచుకోవాలి

  • పేరెంట్, టీచర్, స్టూడెంట్ (టీచర్ ద్వారా లాగిన్) లేదా స్టూడెంట్ (సెల్ఫ్ పార్టిసిపేషన్) కేటగిరీ‌లల్లో తగినదాన్ని ఎంచుకున్నాక పార్టిసిపేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

  • ఆ తరువాత ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి


ఇవీ చదవండి

ఐదేళ్ల తర్వాత సత్యం ఎపిసోడ్‌

ఇండిగోకు 458 కోట్ల జీఎస్టీ ఫైన్‌

Updated Date - Jan 01 , 2026 | 09:37 AM