Share News

Satyam Scam: ఐదేళ్ల తర్వాత సత్యం ఎపిసోడ్‌

ABN , Publish Date - Jan 01 , 2026 | 07:00 AM

బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌ ఇండియా’ సిరీస్‌ చివరి భాగం ఎట్టకేలకు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. సత్యం సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు రామలింగరాజు..

Satyam Scam: ఐదేళ్ల తర్వాత సత్యం ఎపిసోడ్‌

  • రామలింగరాజు స్కాంపై బ్యాడ్‌బాయ్‌

  • బిలియనీర్‌ సిరీస్‌ చివరి భాగం విడుదల

న్యూఢిల్లీ, డిసెంబరు 31: ‘బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌ ఇండియా’ సిరీస్‌ చివరి భాగం ఎట్టకేలకు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. సత్యం సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు రామలింగరాజు, సత్యం సర్వీసెస్‌ కుంభకోణాన్ని కేంద్రబిందువుగా చేసుకొని రూపొందించిన ఈ ఇన్వెస్టిగేటివ్‌ డాక్యుమెంటరీ నాలుగో భాగం ఐదేళ్ల న్యాయపోరాటం తర్వాత ‘రైడింగ్‌ ది టైగర్‌’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకొచ్చింది. ఈ డాక్యుమెంటరీలో అర్ధసత్యాలున్నాయని, తన పరువుకు నష్టం కలుగుతుందని ఆరోపిస్తూ రామలింగరాజు 2020లో హైదరాబాద్‌ సివిల్‌ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు విడుదలపై స్టే విధించింది. ‘బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌ ఇండియా’ మొదటి సీజన్‌ 2020 అక్టోబరులో విడుదలైంది. ఇందులో విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ సుబ్రతా రాయ్‌ వంటి ప్రముఖులపై చేసిన ఇన్వెస్టిగేటివ్‌ ప్రొఫైల్స్‌ ఉన్నాయి. రామలింగరాజు ఉదంతాన్ని కూడా ఈ సిరీ్‌సలో చిత్రీకరించారు.

Updated Date - Jan 01 , 2026 | 07:01 AM