Global Celebrations: వచ్చేసింది.. 2026
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:45 AM
2026 సంవత్సరానికి ప్రపంచ దేశాలు ఘనంగా స్వాగతం పలికాయి. 2025 డిసెంబరు 31న రాత్రి సంబరాలు అంబరాన్నంటాయి.
న్యూఢిల్లీ, డిసెంబరు 31: 2026 సంవత్సరానికి ప్రపంచ దేశాలు ఘనంగా స్వాగతం పలికాయి. 2025 డిసెంబరు 31న రాత్రి సంబరాలు అంబరాన్నంటాయి. వేర్వేరు టైమ్స్ జోన్స్ వల్ల వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో వేడుకలు జరిగాయి. ఫసిపిక్ ద్వీప దేశం కిరిబాటి(క్రిస్మస్ ఐలాండ్).. 2026లో అడుగుపెట్టిన తొలి దేశంగా నిలిచింది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఎత్తయిన స్కై టవర్ నుంచి భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. బోండి బీచ్ కాల్పుల ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియాలో భారీ భద్రత మధ్య వేడుకలు జరిగాయి. సిడ్నీ హార్బర్‌లో వేలాది మంది ఒక్కచోట చేరి బాణసంచా ప్రదర్శనను తిలకించారు. జపాన్‌లో వేడుకల సమయంలో రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూకంపం సంభవించింది.