Share News

Nimesulide Ban: నిమ్సులైడ్‌ పెయిన్‌ కిల్లర్‌ అధిక డోసులపై నిషేధం

ABN , Publish Date - Jan 01 , 2026 | 06:59 AM

నిమ్సులైడ్‌ అనే పెయిన్‌ కిల్లర్‌ మందుల అధిక డోస్‌ల తయారీ, పంపిణీ, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Nimesulide Ban: నిమ్సులైడ్‌ పెయిన్‌ కిల్లర్‌ అధిక డోసులపై నిషేధం

నూఢిల్లీ, డిసెంబరు 31: నిమ్సులైడ్‌ అనే పెయిన్‌ కిల్లర్‌ మందుల అధిక డోస్‌ల తయారీ, పంపిణీ, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పెయిన్‌ కిల్లర్‌ 100ఎంజీ మోతాదుకు మించి వినియోగం ఆరోగ్యపరంగా తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలోని అత్యున్నత వైద్య పరిశోధన సంస్థ ప్రతిపాదనల మేరకు 100ఎంజీ మోతాదుకు మించిన నిమ్సులైడ్‌ పెయిన్‌ కిల్లర్‌ను నిషేధిస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ పెయిన్‌ కిల్లర్‌ వాడడం వల్ల తక్షణ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, అలాగే, దీనికి ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నాయని కాబట్టి తక్షణం దీనిని నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Updated Date - Jan 01 , 2026 | 06:59 AM