Share News

IndiGo Airlines: ‘ఇండిగో’కు 458 కోట్ల జీఎస్టీ ఫైన్‌

ABN , Publish Date - Jan 01 , 2026 | 05:35 AM

దేశంలోనే అతిపెద్ద విమాన సంస్థ ఇండిగోకు జీఎస్టీ అధికారులు భారీ షాకిచ్చారు.

IndiGo Airlines: ‘ఇండిగో’కు 458 కోట్ల జీఎస్టీ ఫైన్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 31: దేశంలోనే అతిపెద్ద విమాన సంస్థ ఇండిగోకు జీఎస్టీ అధికారులు భారీ షాకిచ్చారు. జీఎస్టీ చట్టం-2017లోని సెక్షన్‌ 74 ప్రకారం.. 2018-19 నుంచి 2022-23 వరకు జీఎస్టీకి సంబంధించి రూ.458,26,16,980 జరిమానా విధించారు. దీనిలో వడ్డీ సహా జరిమానా కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీ దక్షిణ విభాగం సీజీఎస్టీ అదనపు కమిషనర్‌ ఇండిగో సంస్థకు నోటీసులు పంపారు. విదేశీ సరఫరా దారుల నుంచి పొందిన పరిహారం, ఇన్‌పుట్‌ క్రెడిట్‌ ట్యాక్స్‌ను తిరస్కరించిన నేపథ్యంలో ఈ జరిమానా విధించినట్టు వివరించారు. అయితే.. ఈ నిర్ణయాన్ని తాము సవాల్‌ చేస్తామని ఇండిగో అధికారులు ప్రకటించారు.

Updated Date - Jan 01 , 2026 | 05:36 AM