Flower Pots Stolen: లక్నోలోె డెకరేషన్ పూలకుండీలు లూటీ..వీడియో వైరల్
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:27 PM
ఏదైనా ఫ్రిగా దొరుకుతుందని తెలిస్తే చాలు పోటీ పడి మరి దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. లక్నోలో ఇప్పుడు అలాంటి ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక్కడ స్థానికులు చేసిన పనికి మీ కక్కుర్తి తగలెయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
లక్నో : మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్‌పేయి 101 వ జయంతి పురస్కరించుకొని నిన్న (గురువారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్నో సందర్శించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి స్మారక చిహ్నాన్ని మోదీ ప్రారంభించి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు లక్నో పార్లమెంట్ సభ్యురాలు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ గవర్నర్ అనందిబెన్ పటేల్, సీఎం యోగి కూడా ఉన్నారు. మోదీ వెళ్లిన తర్వాత ఒక అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ‘రాష్ట్రీయ ప్రేరణ స్థల్’ నుండి కొంతమంది స్థానికులు పూల కుండీలను లూటీ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రాష్ట్రీయ ప్రేరణ స్థల్ ప్రారంభోత్సవ సందర్భంగా, లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పోరేషన్ వసంత్ కుంజ్ రోడ్, గ్రీన్ కారిడార్‌తో సహా నగరంలో పలు కీలక ప్రాంతాల్లో పూల కుండీలు, వేలాడే మొక్కలను అందంగా డెకరేషన్ చేశారు. లూటీ చేస్తున్న దృశ్యాలను ఒక వ్యక్తి షూట్ చేస్తూ.. అలా చేయవొద్దని నచ్చచెప్పాడు. అది ఎవరూ పట్టించుకోకుండా కుండీలను బైకులు, కార్లలో తీసుకువెళ్లగా.. మరికొందరు సంచుల్లో తీసుకొని వెళ్లారు. అంతేకాదు ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ కటౌట్లను కూడా ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేయడంపై నెటిజన్లు దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది ‘సర్కారీ మాల్ హై, లూట్ లో’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..