Home » Narendra Modi
సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులు బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో యాత్రికులు చనిపోయారు. ఈ పెను విషాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
జాతీయ గేయం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రత్యేక పోస్టల్ స్టాంపు, నాణేలను విడుదల చేశారు. మన వర్తమానంలో కొత్త స్ఫూర్తిని రగిలించే 'వందేమాతరం' గేయం భారతీయ పౌరుల్లో చిరకాలం గుర్తుండేందుకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా నిర్వహించాలని మోదీ సూచించారు..
భారతీయుల్లో స్వాతంత్ర్యోద్య స్ఫూర్తిని నింపిని వందేమాతర గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025లో విజేతగా నిలిచిన భారత జట్టు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పట్ల భారత స్టార్ క్రికెటర్ దీప్తి శర్మ అభిమానం చాటుకుంది.
భారత్ భారీ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులకు లోనవుతున్న కాలమది. జాతీయ గుర్తింపు భావన, వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఆ కాలంలో వందేమాతరం.. మాతృభూమిని బలం, శ్రేయస్సు, దైవత్వానికి ప్రతీకగా మార్చింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో అసలు బీజేపీనే లేదని సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. ముస్లింలను బీఆర్ఎస్ మోసం చేస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్రెడ్డి.
కాశీబుగ్గ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశీబుగ్గ ఘటన తీవ్రంగా కలచివేసిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
ఓ ప్రపంచ వేదికపై మోదీ ప్రస్తావన తెచ్చారు ట్రంప్. మోదీతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. బుధవారం సౌత్ కొరియాలోని జియోంగ్జులో జరిగిన ‘ఏషియా, పసిఫిక్ ఎకానమిక్ కార్పోరేషన్ (ఏపీఈసీ) సమిట్లో ట్రంప్ పాల్గొన్నారు.
ఏపీ ప్రజలకు రెండింతలు ఆనందాన్ని ఇచ్చే రోజు ఇదంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. రాయలసీమలో సూపర్ జీఎస్టీ... సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఏపీ పర్యటనపై ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతాలో గురువారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ఏపీలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.