Home » Municipal elections
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
నిజమాబాద్ జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మొత్తం 12 వార్డులకు గానూ 10 స్థానాలను దక్కించుకుంది కాంగ్రెస్.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ గులాబీ శ్రేణులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతకు తెరలేపిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన ఈ కౌంటింగ్ ఉదయం 8 గంటలకు కఠిన నిబంధనల మధ్య మొదలైంది.
తెలంగాణలో మున్సిపల్ కౌంటింగ్‌కు ముందు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్‌లో క్యాంప్ పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారింది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య వ్యూహాత్మక పోటీ మరింత తీవ్రతరమైంది. అభ్యర్థులను ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తగా రాత్రికి రాత్రే క్యాంపులకు తరలించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ పుర పోరు చివరి ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఫలితాలను నేడు వెల్లడించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది.
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఓ సంస్థ చేసిన సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.