Home » Mumbai Indians
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం రెండు గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో వాంఖడే వేదికగా ఎస్ఆర్‌హెచ్‌తో ఎంఐ తలపడనుంది. ఈ మ్యాచులోనైనా ముంబై పుంజుకుంటుందా? అనేది చూడాల్సి ఉంది.
ఎంఐ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. గాయం కారణంగా ఆటకు దూరమైన స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్ 29న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ ఆడతాడని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్.. ఓ వివాదంలో చిక్కుకుంది. గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ‘కంకషన్’ దుర్వినియోగానికి పాల్పడిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీనిపై ఆ జట్టు ప్రధాన కోచ్ మహేల జయవర్థనె స్పందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ ఘోరంగా పరాభవం పాలైన సంగతి తెలిసిందే. 208 పరుగులు లక్ష్య ఛేదనలో ఎంఐ 104 పరుగులకే ఆలౌటైంది. ఈ నేపథ్యంలో హార్దిక్ వ్యూహాత్మక తప్పిదాలపై టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటుగా స్పందించాడు.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగుల భారీ తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ ఘోర పరాజయంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి శతకంతో మెరిశాడు. ఫలితంగా ముంబైపై 103 పరుగులు భారీ తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఈ క్రమంలోనే శాంసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్(101*) మరోసారి సెంచరీతో చెలరేగాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో ఉత్కంఠ పోరు జరగనుంది. మరికాసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ రోబో చంపక్‌తో కలిసి ముంబైలో సందడి చేశాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ కోసం ముంబై చేరుకున్న అతడు.. వాంఖడే గ్రౌండ్‌లో రోబోతో సరదాగా గడిపాడు.
IPL 2026: హార్దిక్, కృనాల్ పాండ్య సోదరుల మధ్య విభేదాలు వచ్చాయని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై కృనాల్ స్పందించాడు. తమ సోదరుల మధ్య వస్తోన్న వార్తలను ఖండించాడు.