Share News

ఐపీఎల్ 2026: చంపక్‌తో చిన్నపిల్లాడిలా ఆడిన ధోనీ

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:24 PM

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ రోబో చంపక్‌తో కలిసి ముంబైలో సందడి చేశాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ కోసం ముంబై చేరుకున్న అతడు.. వాంఖడే గ్రౌండ్‌లో రోబోతో సరదాగా గడిపాడు.

ఐపీఎల్ 2026: చంపక్‌తో చిన్నపిల్లాడిలా ఆడిన ధోనీ
MS Dhoni

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం) ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఇక మ్యాచ్‌కు ముందు సీఎస్కే మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (Dhoni) వాంఖడే స్టేడియంలో సరదాగా గడిపాడు. ప్రాక్టీస్‌లో భాగంగా మైదానంలోకి వచ్చిన ధోని.. ‘చంపక్‌’ అనే రోబో డాగ్‌తో ఆడుకున్నాడు. రోబోకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి చిన్నపిల్లాడిలా కిందపడుకొని సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సీఎస్కే విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.


మరోవైపు ఇవాళ ముంబైతో జరిగే ఈ మ్యాచ్‌లోనైనా ధోని ఆటను చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 44 ఏళ్ల వయసులో కూడా ధోనీకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇవాళ జరిగే మ్యాచ్‌లో ధోని ఆడతాడా లేదా అనేది కచ్చితంగా తెలియకపోయినా, మ్యాచ్‌కు ముందు అతను చంపక్‌తో వాంఖడే స్టేడియంలో సరదగా గడుపుతు కనిపించాడు. ధోనీ చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.


ఐపీఎల్ టోర్నీలో నిలకడైన ప్రదర్శనలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. అతను 278 మ్యాచ్‌ల్లో 242 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 38.30 సగటు,137.45 స్ట్రైక్ రేట్‌తో 5,439 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో ధోని ఖాతాలో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుత సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్న సీఎస్కే జట్టులోకి ధోనీ తిరిగి రావడం కచ్చితంగా సాయపడుతుంది.


ఇవి కూడా చదవండి:

రాజస్థాన్‌ లాగేసుకుంది

45 ఏళ్ల వయసులోనూ..

Updated Date - Apr 23 , 2026 | 04:09 PM