Share News

45 ఏళ్ల వయసులోనూ..

ABN , Publish Date - Apr 23 , 2026 | 01:56 AM

వెటరన్‌ టెన్నిస్‌ తార వీనస్‌ విలియమ్స్‌ వరుస ఓటములు ఎదురవుతున్నా పట్టు వదలడం లేదు. మంగళవారం రాత్రి జరిగిన మాడ్రిడ్‌ ఓపెన్‌ సింగిల్స్‌ తొలి పోరులో ఓటమిపాలైన 45 ఏళ్ల వీనస్‌...

45 ఏళ్ల వయసులోనూ..

ఫ్రెంచ్‌ ఓపెన్‌కు సిద్ధమన్న వీనస్‌

మాడ్రిడ్‌: వెటరన్‌ టెన్నిస్‌ తార వీనస్‌ విలియమ్స్‌ వరుస ఓటములు ఎదురవుతున్నా పట్టు వదలడం లేదు. మంగళవారం రాత్రి జరిగిన మాడ్రిడ్‌ ఓపెన్‌ సింగిల్స్‌ తొలి పోరులో ఓటమిపాలైన 45 ఏళ్ల వీనస్‌.. ఇప్పుడు ఫ్రెంచ్‌ ఓపెన్‌పై గురి పెట్టింది. వచ్చేనెల 24 నుంచి జరిగే ఈ క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్‌లో ఆడాలనుకుంటున్నట్టు తెలిపింది. మాడ్రిడ్‌ మ్యాచ్‌తో వీనస్‌ సింగిల్స్‌లో వరుసగా పదో పరాజయాన్ని చవిచూసింది. 16 నెలల విరామానంతరం గతేడాది మధ్యలో రాకెట్‌ పట్టిన వీనస్‌.. అప్పటినుంచి ఆడిన ప్రతి టోర్నీలోనూ ఆరంభ మ్యాచ్‌లోనే వెనుదిరిగింది. అయినా ఈ ఓటములతో తాను అధైర్య పడడం లేదనీ, వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ లభిస్తే కచ్చితంగా రోలాండ్‌ గారోస్‌లో పోటీపడతానని వీనస్‌ పేర్కొంది. కెరీర్‌లో ఏడు సింగిల్స్‌ గ్రాండ్‌స్లామ్స్‌ సాధించిన వీనస్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ట్రోఫీలను మాత్రం అందుకోలేకపోయింది. ఇక, చివరిగా 2021లో రోలాండ్‌ గారో్‌సలో ఆడిన ఆమె అప్పుడు తొలి రౌండ్లోనే వెనుదిరిగింది.

ఇవి కూడా చదవండి:

డ్రగ్స్ టెస్టులో పాజిటివ్.. పాక్ క్రికెటర్‌ కాంట్రాక్ట్ రద్దు చేసిన పీసీబీ

భారత లీగ్‌లో ఆడినందుకు ఆసీస్ మాజీ ప్లేయర్‌పై వేటు

Updated Date - Apr 23 , 2026 | 01:56 AM